ఐప్యాడ్ మినీ వచ్చేసింది... ఐప్యాడ్3తో పోలిస్తే?

Posted By:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

‘ఐప్యాడ్ మినీ’ని ఆపిల్ వర్గాలు మంగళవారం అధికారికంగా ఆవిష్కరించాయి. నవంబర్ 2 నుంచి గ్లోబల్ మార్కెట్‌లో ఈ డివైజ్ లభ్యం కానుంది. ఇండియాన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై వర్షన్‌లో మాత్రమే ఐప్యాడ్ మినీ లభ్యంకానుంది. ఈ నేపధ్యంలో ఐప్యాడ్ 3, ఐప్యాడ్ మినీ మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేస్తూ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా..

బరువు ఇంకా చుట్టుకొలత....

ఐప్యాడ్ మినీ: చుట్టుకొలత 200 x 134.7 x 7.2మిల్లీమీటర్లు, బరువు 308 గ్రాములు,

ఐప్యాడ్ 3: చుట్టుకొలత 241.2 x 185.7 x 9.4మిల్లీమీటర్లు, బరువు 652 గ్రాములు,

డిస్‌ప్లే.......

ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ఐప్యాడ్ 3: 9.7 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిల్ ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రెటీనా డిస్ ప్లే, రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్,

ప్రాసెసర్......

ఐప్యాడ్ మినీ: 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్,

ఐప్యాడ్ 3: 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం......

ఐప్యాడ్ మినీ: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,

ఐప్యాడ్ 3: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

ఐప్యాడ్ మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఐప్యాడ్ 3: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), స్కైప్ ఇంకా ఫేస్‌టైమ్,

మెమెరీ.......

ఐప్యాడ్ మినీ: మెమరీ కాన్ఫిగరేషన్స్.. 8జీబి, 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబీ ర్యామ్ (నిర్థారణ కావల్సి ఉంది).

ఐప్యాడ్ 3: మెమెరీ కాన్ఫిగరేషన్స్...16జీబి, 32జీబి, 64జీబి, 1జీబి ర్యామ్.

కనెక్టువిటీ......

ఐప్యాడ్ మినీ: లైటింగ్ పోర్ట్, 30 పిన్‌డాక్ కనెక్టర్, వై-ఫై, 3జీ/4జీ సెల్యులర్ వైర్‌లెస్ ఇంటర్నెట్,

ఐప్యాడ్ 3: 3జీ కనెక్టువిటీ,

బ్యాటరీ......

ఐప్యాడ్ మినీ: 16.3వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

ఐప్యాడ్ 3: 42.5 వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

ధరలు.......

ఐప్యాడ్ మినీ: 16జీబి రూ.31,874, 32జీబి రూ.38,819, 64జీబి రూ.45,763. (గమనిక ఈ ధరలు అంచనా మాత్రమే),

ఐప్యాడ్ 3: వై-ఫై వర్షన్- 16జీబి రూ.30,500, 32జీబి రూ.36,500, 64జీబి రూ.42,500, వై-ఫై+4జీ - 16జీబి రూ.38,900. 32జీబి రూ.44,900, 64జీబి రూ.50,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot