ఐప్యాడ్ మినీ x ఐప్యాడ్ 4... ఏది బెస్ట్?

Posted By: Super

ఐప్యాడ్ మినీ x ఐప్యాడ్ 4... ఏది బెస్ట్?

 

ఆపిల్ అభిమానులను ఉత్కంఠకు లోను చేసిన ‘ఐప్యాడ్ మినీ’ని మంగళవారం అమెరికాలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ డివైజ్ సంబంధించి ప్రీ-ఆర్డర్లను ఆపిల్ స్టోర్లు నేటి నుంచి ఆహ్వానించనున్నాయి. ఈ నేపధ్యంలో ట్రెండ్ ఇంకా ఆధునిక టెక్నాలజీని కోరుకునే ఆపిల్ అభిమానులకు ఆసక్తికర సమాచారాన్ని అందించేందుకు గిజ్‌బాట్ సిద్ధంగా ఉంది. ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆపిల్ వర్గాలు 9.7 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ‘ఐప్యాడ్ 4’ను ఆవిష్కరించాయి. ఐప్యాడ్3కు

అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న ఐప్యాడ్ 4... శక్తివంతమైన అత్యాధునిక ఏ6 ప్రాసెసర్ ఇంకా వేగవంతమైన వై-ఫై వ్యవస్థలను కలిగి ఉంది. ఈ డివైజ్ ప్రీ-ఆర్డ్రర్‌లను ఆపిల్ స్టోర్లు నేటి నుంచి స్వీకరించనున్నాయి. నవంబర్ 2 నుంచి పలు దేశాల రిటైల్ మార్కెట్లలో ఇవి లభ్యంకానున్నాయి.  ‘ఐప్యాడ్ మినీ’ ఇంకా ‘ఐప్యాడ్ 4’ ఇండియాలో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. వీలైనంత త్వరలోనే ఇవి దేశీయ విపణిలో లభ్యమయ్యే అవకాశముంది. ఈ అత్యుత్తమ గ్యాడ్జెట్ల ఎంపిక విషయంలో యూజర్‌కు అవగాహన కలిగించే క్రమంలో రెండు డివైజ్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.......

బరువు ఇంకా చుట్టుకొలత....

ఐప్యాడ్ మినీ: 200 x 134.7 x 7.2మిల్లీ మీటర్లు, బరువు 308 గ్రాములు.

ఐప్యాడ్ 4: 241.2 x 185.7 x 9.4 మిల్లీ మీటర్లు, బరువు 652 గ్రాములు.

డిస్‌ప్లే...

ఐప్యాడ్ మినీ: ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ఐప్యాడ్ 4: 9.7 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రెటీనా డిస్‌ప్లే, రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఐప్యాడ్ మినీ: 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్,

ఐప్యాడ్ 4: డ్యూయల్ కోర్ ఏ6ఎక్స్ ప్రాసెసర్,

ఆపరేటంగ్ సిస్టం...

ఐప్యాడ్ మినీ: ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: 200 కొత్త ఫీచర్లు, ఆపిల్ మ్యాప్స్, మెరుగుపరచబడిన సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్, సరికొత్త సఫారీ బ్రౌజర్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్, సరికొత్త పాస్‌బుక్ అప్లికేషన్, ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్),

ఐప్యాడ్ 4: ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: 200 కొత్త ఫీచర్లు, ఆపిల్ మ్యాప్స్, మెరుగుపరచబడిన సిరి వాయిస్ కమాండ్ అప్లికేషన్, సరికొత్త సఫారీ బ్రౌజర్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్, సరికొత్త పాస్‌బుక్ అప్లికేషన్, ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్),

కెమెరా.....

ఐప్యాడ్ మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ హైడెఫినిషన్ కెమెరా,

ఐప్యాడ్ 4: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ హైడెఫినిషన్ కెమెరా,

స్టోరేజ్....

ఐప్యాడ్ మినీ: మెమరీ కాన్ఫిగరేషన్స్.. 8జీబి, 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబీ ర్యామ్ (నిర్థారణ కావల్సి ఉంది).

ఐప్యాడ్ 4: మెమరీ కాన్ఫిగరేషన్స్.. 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబీ ర్యామ్ (నిర్థారణ కావల్సి ఉంది).

కనెక్టువిటీ.....

ఐప్యాడ్ మినీ: లైటింగ్ పోర్ట్, 30 పిన్‌డాక్ కనెక్టర్, వై-ఫై, 3జీ/4జీ సెల్యులర్ వైర్‌లెస్ ఇంటర్నెట్,

ఐప్యాడ్ 4: లైటింగ్ పోర్ట్, 30 పిన్‌డాక్ కనెక్టర్, వై-ఫై, 3జీ/4జీ సెల్యులర్ వైర్‌లెస్ ఇంటర్నెట్,

బ్యాటరీ......

ఐప్యాడ్ మినీ: 16.3వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

ఐప్యాడ్ 4: 42.5 వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (10 గంటల బ్యాటరీ బ్యాకప్),

ధర.....

ఐప్యాడ్ మినీ: 16జీబి వర్షన్ రూ.31,874, 32జీబి వర్షన్ రూ.38,819, 6జీబి వర్షన్ రూ.45,763.

ఐప్యాడ్ 4: 16జీబి వై-ఫై వేరియంట్ $499 (రూ.30,500), 16జీబి వై-ఫై+ సెల్యులర్ మోడల్ $629 (రూ.34,000).

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం  goprobo.comలో  చూడగలరు. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot