ఆపిల్ అభిమానులకు ‘ట్విస్ట్’..?

Posted By: Staff

ఆపిల్ అభిమానులకు ‘ట్విస్ట్’..?

టెక్నాలజీ పరిశ్రమలో అంతర్జాతీయంగా దిగ్గజ హోదాను అధిరోహించిన ‘ఆపిల్’ కొత్త తరహా ఆవిష్కరణలతో నూతన ఒరవడిని సృష్టిస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో ‘ఐప్యాడ్’ను విడుదల చేసిన ఆపిల్, కంప్యూటింగ్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలికిన విషయం తెలిసిందే. అదే దూకుడుతో ఐప్యాడ్ వర్షన్‌ను అప్‌డేట్ చేస్తూ ‘ఐప్యాడ్ 2’ను విడుదల చేసిన ఆపిల్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

‘ఐప్యాడ్ 2’ను అప్‌గ్రేడ్ చేస్తూ ఆధునిక వర్షన్ ‘ఐప్యాడ్ 3’ను 2012లో తెరముందుకు తెచ్చేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో ట్విస్ట్ ఏముందనుకుంటున్నారా..?,‘ఐప్యాడ్ 3’కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదో తీపి కబురే.. ఐప్యాడ్ 3 విడుదలకు ఇంకొన్ని నెలల సమయం ఉన్న నేపధ్యంలో ఆధునిక వర్షన్ ‘ఐప్యాడ్ 2’ను తెర ముందుకు తెచ్చేందుకు ఆపిల్ కసరత్తులు పూర్తి చేస్తుంది.

తిన్నర్, స్లిమ్మర్ వర్షన్లలో విడుదలవుతున్న ‘ఆధునిక వర్షన్ ఐప్యాడ్ 2’ పటిష్ట బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన బ్లూటూత్, వై-ఫై, 3జీ అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. హై‌‌స్పీడ్ కనెక్టువిటీ సామర్ధ్యం గల యూఎస్బీ పోర్ట్సు, LED బ్యాక్‌లిట్ టీఎఫ్టీ సామర్ధ్యం గల టచ్‌స్క్రీన్ టెక్నాలజీని ఈ గ్యాడ్జెట్లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. పొందుపరిచిన జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఫీచర్లు సున్నితమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తాయట. నలుపు, తెలుగు రంగుల్లో విడుదలకాబోతున్న ‘ఆధునిక వర్షన్ ఐప్యాడ్ 2’ అమ్మకాల విషయంలో వృద్థి సాధిస్తుందని సంస్థ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot