మార్కెట్లోకి యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ మినీ 3

Posted By:

యాపిల్ కంపెనీ ఎట్టకేలకు తన సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ మినీ 3 పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్‌ను ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారానే కాకుండా యాపిల్ ఆథరైజ్డ్ రిటైలర్ స్టోర్‌లలోనూ యాపిల్ విక్రయిస్తోంది.

 మార్కెట్లోకి యాపిల్ అతి పలుచని ఐప్యాడ్

కేవలం 6.1 మిల్లీమీటర్ల మందంతో నాజూకుగా డిజైన్ కాబడిన యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2లో ఐఫోన్‌లలో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను జత చేసారు. బరస్ట్ షాట్స్, స్లో-మోషన్ వీడియో, ఫింగర్‌ఫ్రింట్ ఐడీ సెన్సార్ వంటి ఫీచర్లు డివైస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఐప్యాడ్ ఎయిర్ 2ను యాపిల్ 6 మోడల్స్‌లో అందుబాటులో ఉంచింది. వేరియంట్‌ను బట్టి రూ.35,900 నుంచి రూ.59,900. మధ్య వీటి ధరలు ఉంటాయి. వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై ఇంకా వాయిస్ కాలింగ్ కనెక్టువిటీతో ఈ డివైస్‌ను పొందవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ 2 16జీబి వై-ఫై మోడల్ ధర రూ.35,900. 64జీబి మోడల్ ధర రూ.42,900, 128జీబి మోడల్ ధర రూ.49,900.

ఐప్యాడ్ ఎయిర్ 2 వై-ఫై + సెల్యులార్ కనెక్టువిటీ వర్షన్ 16జీబి మోడల్ ధర 45,900, 64జీబి మోడల్ ధర రూ.52,900, 128జీబి మోడల్ ధర రూ.59,900.

మరో మోడల్ ఐప్యాడ్ మినీ 3 కూడా వివిధ స్టోరేజ్ సామర్థ్యాలలో వై-ఫై, వై-ఫై + సెల్యులార్ కనెక్టువిటీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మోడల్‌ను బట్టి రూ.28,900 నుంచి 52,900ల మధ్య ఐప్యాడ్ మినీ 3 లభ్యమవుతోంది.

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2 ప్రత్యేకతలు:

9.7 అంగుళాల తాకేతెర, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 10 గంటల బ్యాకప్, సిమ్ కార్డ్ సౌకర్యం ఉన్న ఐప్యాడ్ ఎయిర్ 2.. 2జీ, 3జీ, 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

యాపిల్ ఐప్యాడ్ మినీ 3 ప్రత్యేకతలు:

7.9 అంగుళాల తాకేతెర, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 10 గంటల బ్యాకప్, సిమ్‌ కార్డ్ సౌకర్యం ఉన్నఐప్యాడ్ మినీ 3.. 2జీ, 3జీ, 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.

English summary
Apple launches iPad Air 2, iPad Mini 3 in India; prices start at Rs 28,900. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot