‘ఆపిల్’ 2012..?

Posted By: Super

‘ఆపిల్’ 2012..?

 

అంతర్జాతీయంగా టెక్నాలజీ సెక్టార్లో ప్రముఖంగా వినపడే పేరు ‘ఆపిల్’, అయితే తాజాగా వినపడుతున్న గుసగుసలు ‘ఆపిల్‌లో క్రీయాశీలక మార్పులు తధ్యమంటు షికార్లు చేస్తున్నాయి’..?, ఈ అంశం అభిమానులకు ఉత్సాహం మిగిల్చేదా..?, నిరుత్సాహం కలిగించేదా..? కొత్త టెక్నాలజిల పై దృష్టిసారించిన ‘ఆపిల్’ కాలానుగుణ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులను 2012లో పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా యోచన చేస్తుంది.

ఐఫోన్లు మొదలుకుని ఐప్యాడ్, ఐపోడ్ వరకు ‘కొత్త లుక్’,‘సరికొత్త వర్షన్’లో కనిపించబోతున్నాయని  విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  వినియోగదారులను మరింత అబ్బురపరుస్తూ సరికొత్త సూపర్ స్లిమ్ 15 అంగుళాల అత్యాధునిక ల్యాపీని విడుదల చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. మార్కెట్లో ఉన్న ‘మ్యాక్ బుక్ ప్రో’, ‘మ్యాక్ బుక్ ఎయిర్’లకు ధీటుగా ఈ స్లిమ్ ల్యాపీ డిజైన్ కాబడినట్లు తెలుస్తోంది.

అభిమానులను ఊరిస్తూ, ఉత్కంఠకు లోను చేస్తూ 2012 ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ‘ఐప్యాడ్ 3’ రెండు వేరింయంట్లలో విడులవుతున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. J1, J2 వర్షన్లలో విడుదలవుతున్న ‘ఐప్యాడ్ -3’లో ఆధునిక జనరేషన్ టెక్నాలజీని పొందుపరిచారట. ఏదేమైనా ఆపిల్ తీసుకుంటున్న క్రీయాశీలక మార్పులు అటు పరిశ్రమలో, ఇటు సాంకేతిక ప్రేమికుల్లో ఉత్కంఠను రేపటం మాత్ర ఖాయం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot