Home
Computer

తక్కువ ధరలో ఆపిల్‌ నుంచి ల్యాప్‌టాప్.. ఎప్పుడు విడుదల కానుందంటే?

Apple budget Laptops : ఆపిల్‌ నుంచి బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ మ్యాక్‌బుక్ ఐఫోన్‌లలో వినియోగించే చిప్‌తో పనిచేస్తుందని ఇటీవల లీక్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ ల్యాప్‌టాప్‌ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. మార్కెట్‌ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్‌ ఈ వివరాలను షేర్‌ చేసింది.

ఎప్పుడు లాంచ్ అయ్యే అవకాశం ఉంది? :
ట్రెండ్‌ఫోర్స్‌ వివరాల ఆధారంగా తక్కువ ధరలో (Apple Low Cost Macbook) అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఆపిల్ ల్యాప్‌టాప్‌ 12.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తు్న్నారు. ఈ మ్యాక్‌బుక్‌ 2026 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

apple low cost macbook

అతి చిన్న డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌టాప్‌గా! :
ఈ ల్యాప్‌టాప్ ఆపిల్‌ మ్యాక్‌బుక్ లైనప్‌లో అతి చిన్న డిస్‌ప్లే కలిగిన ల్యాప్‌టాప్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ డిస్‌ప్లే 13 అంగుళాలుగా ఉంది. ఆపిల్‌ బడ్జెట్‌ మ్యాక్‌బుక్‌ A18 ప్రో చిప్‌ తో పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ చిప్‌సెట్‌తోనే లాంచ్‌ కానుందా? :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ A18 ప్రో చిప్‌సెట్‌తోనే పనిచేస్తున్నాయి. ఆపిల్‌ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ 8GB ర్యామ్ తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ థండర్‌బోల్ట్‌ పోర్టుకు బదులుగా USB-C పోర్టులను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? :
తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఆపిల్ మ్యాక్‌బుక్‌ బ్లూ, పింక్‌, సిల్వర్‌, యెల్లో కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాక్‌బుక్‌ అమెరికా మార్కెట్‌లో $699 (భారత్ మార్కెట్‌లో సుమారు రూ.63000), $799 (భారత్ మార్కెట్‌లో రూ.72000) గా ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవలే ఆపిల్ ఫోన్‌ రికార్డు స్థాయి విక్రయాలు :
కౌంటర్‌ పాయింట్‌ డేటా రీసెర్చ్‌ ఇటీవల కీలక రిపోర్టును వెల్లడించింది. దీని ఆధారంగా భారత్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది. 2025 సంవత్సరం తొలి 11 నెలల్లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్‌ ఏకంగా 6.5 మిలియన్‌ యూనిట్‌ల (65 లక్షలు) విక్రయాలతో రికార్డు సృష్టించింది.

ఐఫోన్‌ 15 కూడా భారీ స్థాయిలో విక్రయాలను నమోదు చేసింది. అధిక విక్రయాలు నమోదు చేసిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. నోకాస్ట్ EMI ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, బ్యాంక్‌ ఫైనాన్స్‌ ఆఫర్ల కారణంగా ప్రీమియం సెగ్మెంట్ ఫోన్‌లపై అనేక మంది మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం ఆపిల్ సంస్థ భారత్‌ మార్కెట్‌లో తయారీని ప్రోత్సహించింది. దీంతోపాటు భారత్‌ను కేవలం ఉత్పత్తి కోసమే కాకుండా కీలకమైన మార్కెట్‌గా భావించింది. ఇందులో భాగంగా భారత్‌లో బెంగళూరు, పూణే, నోయిడాలో కొత్తగా ఆపిల్‌ స్టోర్‌లను ప్రారంభించింది. ఫలితంగా ఆపిల్‌ స్టోర్‌ల సంఖ్య 5 కు చేరింది.

More from GizBot

Best Mobiles in India

English summary
apple low cost macbook launch timeline tipped here are the expected details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X