Home
Computer

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌.. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ Air M1 ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్‌..!

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌ (Amazon Great indian Festival 2024 sale ) సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ సహా ఇతర గ్యాడ్జెట్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మ్యాక్‌బుక్‌ Air M1 ల్యాప్‌టాప్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ను (Apple Macbook Air M1) ధర రూ.92,900 కు లాంచ్‌ చేశారు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.52,990 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కలిపే ఈ ధరకు కొనుగోలు చేయవచ్చా లేదా అధనంగా బ్యాంకు ఆఫర్లు కూడా ఉండనున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరకే ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే అవకాశం లభించనుందని తెలుస్తోంది.

amazon great indian festival 2024 sale offers best deal on Apple macbook Air M1

13.3 అంగుళాల రెటీనా డిస్‌ప్లే :
ఆపిల్‌ మ్యాక్‌బుక్ M1 ల్యాప్‌టాప్‌ 13.3 అంగుళాల రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. 2560*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు ట్రూ టోన్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌ వినియోగం, ఎడిటింగ్‌ సహా రోజువారీ పనుల కోసం అనుకూలంగా ఉంటుంది.

M1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది :
ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌.. M1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ ద్వారా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. వీడియో ఎడిటింగ్‌, కోడింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌ను సులభంగా పూర్తి చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ బరువుగా 1.29kg గా ఉంది. దూరప్రాంత ప్రయాణాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు.

amazon great indian festival 2024 sale offers best deal on Apple macbook Air M1

ఈ ల్యాప్‌టాప్‌ ఎక్కువ గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 18 గంటలపాటు వినియోగించుకోవచ్చని ఆపిల్‌ చెబుతోంది. ఫలితంగా దూరప్రాంత ప్రయాణాలు సహా ఎక్కువ పని గంటలు కలిగిన వారికి ఈ ల్యాప్‌టాప్‌ సదుపాయంగా ఉంటుందని ఆపిల్‌ చెబుతోంది.

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13 ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఐఫోన్‌ 13 ధర రూ.45,999 కు లిస్టింగ్ చేయబడి ఉంది. SBI బ్యాంకు కార్డులతో రూ.2500 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. స్టార్‌ లైట్‌, ప్రొడక్ట్‌ (రెడ్‌), గ్రీన్, పింక్‌, బ్లూ, మిడ్‌నైట్‌ రంగుల్లో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple macbook Air M1 gets huge discount on amazon great indian festival 2024 sale full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X