Home
Computer

ఆపిల్ నుంచి గుడ్‌న్యూస్‌.. ఈ ల్యాప్‌టాప్‌పై రూ.20000 తగ్గింపు.. సేల్‌ వివరాలు..!

ఆపిల్‌ నుంచి తాజాగా M3 చిప్‌సెట్‌తో 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. దీంతో M2 చిప్‌సెట్‌ కలిగిన 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌ (Macbook Air M2) ధరను తగ్గించింది. ఈ మోడల్‌పై రూ.20,000 తగ్గింపు ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఆపిల్‌ స్టోర్‌లలో కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్‌ M2 ధర రూ.1,19,900 గా ఉంది. రూ.20,000 తగ్గింపుతో రూ.99,900 (Discounts on Apple Laptops 2024) కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎడ్యుకేషన్‌ ఆఫర్‌లో భాగంగా విద్యార్థులు సహా టీచర్లకు ఈ ల్యాప్‌టాప్‌ను రూ.89,900 కే అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆపిల్‌ స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

Macbook air M2 gets RS 20000 Price discount

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 ల్యాప్‌టాప్‌ స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. సన్నని బెజెల్స్‌, భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఆపిల్‌కు చెందిన శక్తివంతమైన చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఈ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 1080 పిక్సల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీని ద్వారా మెరుగైన అనుభూతిని పొందవచ్చు. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో వస్తుంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M2 2022లో లాంచ్‌ చేశారు. ల్యాప్‌టాప్‌ 8GB ర్యామ్‌ + 256GB ర్యామ్‌ మరియు 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లే, 1080 పిక్సల్‌ ఫేస్‌టైం HD కెమెరా, మెగ్‌సేఫ్‌ 3 ఛార్జింగ్ పోర్ట్‌ మరియు 2 థండర్‌ పోర్టులను కలిగి ఉంది. మిడ్‌నైట్‌, స్టార్‌లైట్‌, సిల్వర్‌ మరియు స్పేస్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.

Macbook air M2 gets RS 20000 Price discount

* తాజాగా యాపిల్‌ కొత్త మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ ల్యాప్‌ శక్తివంతమైన M3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M3 ల్యాప్‌టాప్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,14,900, అదే 8GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ రూ.1,34,900, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ రూ.1,54,900 గా ఉంది.

ఆపిల్‌ ఎడ్యుకేషన్ ఆఫర్‌లో భాగంగా ఈ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M3 ల్యాప్‌టాప్‌ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,04,900 కే కొనుగోలు చేయవచ్చు. అయితే 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M3 ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.1,34,900 గా ఉంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.1,74,900 గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Macbook air M2 laptop gets RS 20000 Price discount in india 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X