Home
Computer

ఆపిల్‌ లేటెస్ట్ ల్యాప్‌టాప్‌పై రూ.10 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్‌.. సూపర్‌ ఫీచర్‌లు!

ఆపిల్‌ ఈ సంవత్సరం M4 చిప్‌సెట్‌ తో మ్యాక్‌బుక్ ఎయిర్‌ (2025) ను (Apple Macbook Air 2025) లాంచ్‌ చేసింది. ఈ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.99,900 గా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌ను డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. విడుదల ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 ల్యాప్‌టాప్‌ ఫీచర్లు, సేల్‌ వివరాలు.

ధర, సేల్‌ వివరాలు :
భారత్‌ మార్కెట్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 (2025) ల్యాప్‌టాప్‌ 16GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.99,900 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Apple Macbook Air M4 Chip 2025

రూ.5 వేల డిస్కౌంట్ :
అమెజాన్‌లో ఈ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ ధర రూ.92,900 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ మ్యాక్‌బుక్‌ మిడ్‌నైట్‌, స్టార్‌లైట్‌, స్కై బ్లూ, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

సూపర్ రెటీనా డిస్‌ప్లే :
ఈ మ్యాక్‌బుక్ ఎయిర్‌ M4 (2025) ల్యాప్‌టాప్‌ 13 అంగుళాల (2560 x 1664 పిక్సల్స్‌) సూపర్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 224 ppi పిక్సల్స్‌ డెన్సిటీని కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం టచ్‌ ID బటన్‌ను అమర్చి ఉంది.

M4 చిప్‌సెట్ :
ఈ ల్యాప్‌టాప్‌ M4 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. 4 ప్రైమ్ కోర్స్, 4 ఎఫీషియన్సీ కోర్స్‌తో 10 కోర్‌ CPUను కలిగి ఉంది. మ్యాక్‌బుక్‌ అనేక ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా 12MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ లైఫ్‌ :
ఈ ల్యాప్‌టాప్‌ 70W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 53.8Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుందని ఆపిల్ చెబుతోంది. స్పేషియల్‌ ఆడియో సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 3 మైక్రో ఫోన్‌లు ఉన్నాయి.

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 (2025) కనెక్టివిటీ పరంగా వైఫై 6E, బ్లూటూత్ 5.3, Magsafe 3 ఛార్జింగ్‌ పోర్టు, రెండు USB-4 పోర్టులు ఉన్నాయి.

* ఆపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ గురించి ఇటీవల కీలక వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐఫోన్‌ ధర $2399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2,14,100) గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ బుక్‌ స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 9mm థిక్‌నె‌స్‌, అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 4.5mm థిక్‌నెస్‌ ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Macbook Air M4 Chip 2025 gets more than Rs10000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X