Home
Computer

డిస్కౌంట్ ధరకు ఆపిల్‌ ల్యాప్‌టాప్‌.. M4 చిప్‌, 18 గంటల బ్యాటరీ లైఫ్‌ సహా!

ఆపిల్‌ నుంచి భారత్ మార్కెట్‌లో M5 చిప్‌సెట్‌తో ఈనెల రెండో వారంలో మ్యాక్‌బుక్‌ ప్రో 2025, ఐప్యాడ్‌ ప్రో 2025 లాంచ్ అయ్యాయి. ఇటీవల సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం మ్యాక్‌బుక్‌ ఎయిర్ M4 (Apple Macbook Air M4) మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ఆఫర్‌ అందుబాటులోకి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల, ఆఫర్ వివరాలు.

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 మోడల్‌ సన్నని డిజైన్‌తో అందుబాటులో ఉంది. M4 చిప్‌తో పనిచేస్తుంది. ఆపిల్‌ సిలికాన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 13 అంగుళాలు, 15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

Apple macbook Air M4 with 13 inch display and 18 hours of battery life

డిస్కౌంట్ ఆఫర్ :
మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 ల్యాప్‌టాప్‌ విడుదల సమయంలో 16GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.99,900 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.90,990 ధరకు అందుబాటులో ఉంది.

అయితే అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను సుమారు రూ.85 వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ మిడ్‌నైట్‌, స్టార్‌లైట్, స్కై బ్లూ, సిల్వర్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M4 ల్యాప్‌టాప్ :
ఆపిల్‌ M4 మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ల్యాప్‌టాప్ 13, 15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు అల్యూమినియం డిజైన్‌తో ఉంది. ఈ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ మోడల్‌ Siri ని కూడా సపోర్టు చేస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేసి ఏకంగా 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది. Magsafe ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. రెండు థండర్‌బోల్ట్‌ పోర్టులను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 12MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను కలిగి ఉంది. వీడియో కాల్స్ వంటి సమయాల్లో ఫ్రేమ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.

ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్ M5 :
ఈనెల రెండో వారంలో ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M5 మోడల్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ల్యాప్‌ 16GB ర్యామ్+ 512GB SSD స్టోరేజీ ధర రూ.1,69,900, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.1,89,900, 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.2,09,900 గా ఉంది.

మ్యాక్‌బుక్ ప్రో 2025 ల్యాప్‌టాప్‌ 14.2 లిక్విడ్‌ రెటీనా ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz ప్రో మోషన్‌ రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 254ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ macOS Tahoe (macOS 26) పైన పనిచేస్తుంది.

ఈ ల్యాప్‌ 12MP సెంటర్‌ స్టేజ్ కెమెరాను కలిగి ఉంది. 72.4W బ్యాటరీని కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ 70W USB-C పవర్‌ అడాప్టర్‌ను కలిగి ఉంది. అయితే యూజర్లు కావాలనుకుంటే 96W పవర్‌ అడాప్టర్‌ను కూడా ఎంచుకోవచ్చు. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో 6 స్పీకర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple macbook Air M4 with 13 inch display and 18 hours of battery life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X