ఆపిల్ ల్యాప్‌టాప్‌పై రూ.13 వేల డిస్కౌంట్.. M4 చిప్‌సెట్, 18 గంటల బ్యాటరీ లైఫ్..!
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఈ సంవత్సరం (Apple Macbook M4 Laptop) విడుదల అయింది. రెండు డిస్‌ప్లే వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. అల్యూమినియం డిజైన్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఆపిల్ ల్యాప్‌టాప్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. M4 చిప్‌సెట్ తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్ పూర్తి వివరాలు.
అమెజాన్‌లో డిస్కౌంట్ :
భారత్ మార్కెట్ లో విడుదల అయిన సమయంలో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ ధర రూ.99,900 గా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లో మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌ను రూ.8 వేల డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు.

మొత్తంగా రూ.13 వేల డిస్కౌంట్ :
అంటే రూ.91900 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డుపై రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.13,000 డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా రూ.86900 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు EMI ఆప్షన్ ద్వారా మరింత డిస్కౌంట్ ను పొందవచ్చు.
స్లిమ్ అల్యూమినియం డిజైన్ :
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ స్లిమ్ అల్యూమినియం డిజైన్ ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 13 అంగుళాలు, 15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్, మల్టీ టచ్ గెశ్చర్ సపోర్టును కూడా కలిగి ఉంది.

M4 చిప్‌సెట్ :
ఈ ఆపిల్ ల్యాప్‌టాప్ M4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు 16 కోర్ న్యూట్రల్ ఇంజిన్ ను కూడా కలిగి ఉంది. వీడియో కాల్స్ కోసం ఆపిల్ 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కలిగి ఉంది. మీటింగ్స్, వీడియో కాల్స్ సమయంలో ఫ్రేమ్ ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
AI ఫీచర్లు :
సాఫ్ట్‌వేర్ పరంగా AI ఆధారిత అసిస్టెంట్‌ను కలిగి ఉంది. ChatGPT ఇంటిగ్రేషన్‌తో Siri అందుబాటులో ఉంటుంది. మరియు రైటింగ్ టూల్స్‌ను కలిగి ఉంది. స్పేషియల్ ఆడియో, 3 మైక్రోఫోన్‌తో కూడిన క్వాడ్ కర్వడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఈ ల్యాప్‌టాప్ 13 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ 53.8Wh బ్యాటరీ, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. అదే 15 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ 66.5Wh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్టంగా 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6E, రెండు థండర్ బోల్ట్ పోర్టులు, 4 USB-C ఛార్జింగ్ పోర్టులు, Magsafe 3 ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








