Home
Computer

ఆపిల్‌ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ విడుదల.. లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లే, A18 ప్రో చిప్‌.. రూ.10 వేల డిస్కౌంట్‌

Apple macbook Neo : ఆపిల్‌ నుంచి ఎట్టకేలకు బడ్జెట్ సెగ్మెంట్‌ లో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. తక్కువ ధరలో మ్యాక్‌బుక్‌ అందుబాటులోకి వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. తాజాగా ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ నియో విడుదల అయింది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కలిగి ఉన్న A18 ప్రో చిప్‌తోనే ఈ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. ఒక్కసారి పూర్తిగా 16 గంటల వరకు వినియోగించుకోవచ్చని ఆపిల్‌ చెబుతోంది.

మ్యాక్‌బుక్‌ నియో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఈ ఆపిల్‌ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ 13 అంగుళాల లిక్విడ్‌ రెటీనా IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 219 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. వీడియో కాల్స్‌ కోసం 1080p పేస్‌టైమ్‌ HD వెబ్‌క్యామ్‌ ను కలిగి ఉంది. వైడ్‌ స్పెక్ట్రమ్‌ మైక్రోఫోన్‌ మోడ్‌, వాయిస్‌ ఐసోలేషన్‌ తో డ్యూయల్‌ మైక్‌ సిస్టమ్‌ ఉంది.

Apple macbook Neo with A18 Pro Chip price

ఈ ఫోన్‌లో వినియోగించిన చిప్‌తో :
మ్యాక్‌బుక్‌ నియో A18 ప్రో చిప్‌తో పనిచేస్తుంది. ఐఫోన్‌ 16 ప్రో సిరీస్‌ ఇదే చిప్‌ ను కలిగి ఉంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 చిప్‌ కలిగిన విండోస్‌ కంప్యూటర్‌ తో పోలిస్తే ఈ చిప్‌ కలిగిన మ్యాక్‌బుక్‌ 5 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుందని తెలిపింది. ఈ ల్యాప్ macOS Tahoe పైన పనిచేస్తుంది.

మేజిక్‌ కీబోర్డు :
అదే విధంగా AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) టాస్క్‌ల్లో మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మొత్తంగా ఈ ల్యాప్‌టాప్‌ రెండు స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌ ఆపిల్‌ మేజిక్‌ కీబోర్డును కలిగి ఉంది. అయితే కేవలం 512GB స్టోరేజీ వేరియంట్ మాత్రమే Touch ID ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 6, వైఫై 6E, USB-C 3.0, USB-C 2.0 పోర్టులు ఉన్నాయి. దీంతోపాటు హెడ్‌ఫోన్‌ జాక్‌ కూడా ఉంది. స్పేషియల్ ఆడియో సపోర్టుతో డాల్బీ అట్మాస్‌ డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది.

Apple macbook Neo with A18 Pro Chip price

మ్యాక్‌బుక్‌ నియో 36.5Wh బ్యాటరీని సపోర్టు చేస్తుంది. 20W ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 11 గంటల వెబ్‌ బ్రౌజింగ్‌ లేదా 16 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ కోసం వినియోగించుకోవచ్చని ఆపిల్‌ చెబుతోంది.

మ్యాక్‌బుక్‌ నియో ధర, సేల్‌ వివరాలు :
ఆపిల్ బడ్జెట్‌ ల్యాప్‌టాప్ (Apple Budget Laptop) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,900 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.79,900 గా ఉంది. విద్యార్థులకు రూ.10000 డిస్కౌంట్‌ను అందిస్తామని ఆపిల్‌ తెలిపింది.

భారత్‌లో ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ మ్యా్‌క్‌బుక్‌ బ్లస్‌, ఇండిగో, సిల్వర్‌, సిట్రస్‌ కలర్‌ వేరియంట్స్‌లో భారత్‌ మార్కెట్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple macbook Neo with A18 Pro Chip launched in india now open for pre booking
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X