Apple Macbook Pro M5 : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M5 ల్యాప్‌టాప్ విడుదల.. ధర, ఫీచర్లు, సేల్ వివరాలు..!
Apple Macbook Pro M5 : ఆపిల్ భారత్‌లో తాజాగా M5 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ ప్రో, విజన్ ప్రో లను విడుదల చేసింది. కొత్తగా తీసుకొచ్చిన Macbook Pro M5 గత వేరియంట్‌తో పోలిస్తే అనేక విధాలుగా మెరుగైన పనితీరును కనబరుస్తుందని ఆపిల్ చెబుతోంది. బ్యాటరీ పరంగానూ ఆకట్టుకుంటుందని తెలిపింది. ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M5 చిప్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
మ్యాక్‌బుక్ ప్రో M5 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
మ్యాక్‌బుక్ ప్రో 2025 ల్యాప్‌టాప్ 14.2 అంగుళాల (3024 x 1964 పిక్సల్స్) లిక్విడ్ రెటీనా ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz ప్రో మోషల్ రీఫ్రెష్ రేట్, ట్రూ టోన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 254ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. నానో టెక్చర్ ఫినిష్‌తో కూడిన డిస్‌ప్లే ను కూడా ఎంచుకొనే అవకాశం ఉందని ఆపిల్ చెబుతోంది.

మ్యాక్‌బుక్ ప్రో 2025 ల్యాప్‌టాప్ M5 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్ 10 కోర్ CPU, 10 కోర్ GPU తోపాటు 32GB వరకు యూనిఫైడ్ స్టోరేజీ, 4TB వరకు SSD స్టోరేజీని సపోర్టు చేస్తుంది. AI టాస్క్‌ల కోసం 16 కోర్ Neural Engine ను కలిగి ఉంది.
ఈ మ్యాక్‌బుక్ ప్రో M5 ల్యాప్‌టాప్ macOS Tahoe (macOS 26) పైన పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఆపిల్ ఇంటిలెజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఆపిల్ ల్యాప్‌టాప్ 72.4W బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 24 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ సపోర్టును పొందవచ్చని చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ కోసం 70W USB-C పవర్ అడాప్టర్ ను అందిస్తుంది. అయితే యూజర్లు 96W పవర్ అడాప్టర్ ను కూడా ఎంచుకోవచ్చు.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6E, మూడు థండర్‌బోల్ట్ 5 పోర్టులు, మెగ్‌సెఫ్ 3 ఛార్జింగ్ పోర్టు, HDMI పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం Touch ID సెన్సర్‌ను అమర్చి ఉంటుంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో 6 స్పీకర్లను కలిగి ఉంది.

మ్యాక్‌బుక్ ప్రో M5 ధర, సేల్ వివరాలు :
మ్యాక్‌బుక్ ప్రో M5 16GB ర్యామ్+ 512GB SSD స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,69,900 గా ఉంది. 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,89,900, 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.2,09,900 గా ఉంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M5 మోడల్‌ను ప్రస్తుతం ప్రీ ఆర్డర్ (ముందస్తు బుకింగ్) చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ 22 వ తేదీ నుంచి భారత్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ స్టోర్‌లో ఈ ఉత్పత్తులపై విద్యా్ర్థులు రూ.10,000 తగ్గింపును పొందవచ్చు.

ఆపిల్ విజన్ ప్రో M5 :
మ్యాక్‌బుక్ ప్రో M5, ఐప్యాడ్ ప్రో M5 విడుదలతోపాటు M5 చిప్‌సెట్‌తో కూడిన విజన్ ప్రో మోడల్‌ను పరిచయం చేసింది. గత వేరియంట్‌తో పోలిస్తే గ్రాఫిక్స్, బ్యాటరీ లైఫ్ పరంగా మెరుగైన పనితీరును అందిస్తుందని ఆపిల్ చెబుతోంది. కంఫర్ట్ కోసం డ్యూయల్ నిట్ బ్యాండ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాండ్ టూ స్ట్రాప్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మొత్తంగా చూస్తే గత వేరియంట్‌తో పోలిస్తే సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది.
ఆపిల్ తాజాగా తీసుకొచ్చిన విజన్ ప్రో మోడల్ 3nm M5 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 10 కోర్ CPU, GPU ను కలిగి ఉంటుంది. కొత్త GPU ఆర్కిటెక్చర్.. లైటింగ్, షాడో, రిఫ్లక్షన్‌ను మెరుగుపరుస్తుందని చెబుతోంది. మైక్రో OLED డిస్‌ప్లే మరింత ఆకట్టుకుంటుందని ఆపిల్ చెబుతోంది.
ఆపిల్ విజన్ ప్రో M5 మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రత్యేకమైన R1 చిప్, 5 సెన్సార్లు, 6 మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఈ విజన్ ప్రో 2025 మోడల్ 16 కోర్ Neural ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఆపిల్ VisionOS 26 పైన పనిచేస్తుంది. 180 డిగ్రీలు, 360 డిగ్రీల్లో వీక్షించేందుకు అత్యంత అనువుగా ఉంటుంది.
ఆపిల్ విజన్ ప్రో M5 ప్రారంభ ధర $3499 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.3,08,000) గా ఉంటుంది. 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అమెరికా సహా అనేక దేశాల్లో ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో అందుబాటులోకి రావడంపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








