Home
Computer

ఆపిల్‌ నుంచి పవర్‌ఫుల్‌ చిప్‌సెట్‌తో ల్యాప్‌టా‌ప్‌లు.. రోజంతా బ్యాటరీ లైఫ్‌ సహా ఆకట్టుకొనే ఫీచర్లు..!

Apple Macbook Pro M5 Pro, M5 Max Chip : ఆపిల్‌ నుంచి మ్యాక్‌బుక్ ఎయిర్‌ 2026 తోపాటు మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్‌ కూడా లాంచ్‌ అయ్యాయి. ఎయిర్‌ మోడల్‌ M5 చిప్‌ ను కలిగి ఉంది. అదే మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ M5 ప్రో, M5 మ్యాక్స్‌ చిప్‌ తో అందుబాటులోకి వచ్చాయి. గత మోడల్స్‌ తో పోలిస్తే పనితీరు, బ్యాటరీ లైఫ్‌, ఏఐ పీచర్ల పరంగా మెరుగ్గా ఉంటుందని ఆపిల్ చెబుతోంది. ప్రో మోడల్స్‌ రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌ లో లభిస్తాయి.

రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో :
మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్‌ 14 అంగుళాలు, 16 అంగుళాల లిక్విడ్‌ రెటీనా XDR డిస్‌ప్లే వేరియంట్స్‌ లో అందుబాటులోకి వచ్చాయి. 1600 నిట్స్‌ పీక్‌ HDR బ్రైట్‌నెస్‌ ను అందిస్తుంది. దీంతోపాటు నానో టెక్స్‌చర్‌ ఫీచర్‌ కూడా ఉంది. బ్లూటూత్‌ 6, వైఫై 7 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Apple Macbook pro with M5 Pro  M5 max chips

M5 ప్రో, M5 మ్యాక్స్‌ చిప్‌లతో :
మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్ M5 ప్రో, M5 మ్యాక్స్‌ చిప్‌ లతో పనిచేస్తాయి. ఈ చిప్‌లు ఆపిల్ కొత్తగా తయారు చేసిన ఫ్యూజన్‌ ఆర్కిటెక్చర్‌ పైన పనిచేస్తాయి. M1 మోడల్స్‌ తో పోలిస్తే 8 రెట్లు ఏఐ పనితీరును కనబరుస్తాయని ఆపిల్‌ చెబుతోంది. దీంతోపాటు గత వేరియంట్‌ తో పోలిస్తే మెరుగైన పనితీరు లభిస్తుంది.

ఆపిల్‌ వైర్‌లెస్‌ చిప్‌ :
ఈ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌లు MacOS Tahoe పైన పనిచేస్తాయి. ఫలితంగా ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు పూర్తి స్థాయిలో సపోర్టు చేస్తాయి. ఇందులో లైవ్ ట్రాన్స్‌లేషన్లు, స్పాట్‌లైట్‌ సెర్చ్ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌ N1 వైర్‌లెస్ చిప్‌ కూడా ఉంది.

Apple Macbook pro with M5 Pro  M5 max chips

సెంటర్‌ స్టేజ్‌ కెమెరా :
వీడియో కాల్స్‌ కోసం ఈ ఆపిల్‌ ల్యాప్‌టాప్‌లు 12MP సెంటర్‌ స్టేజ్‌ కెమెరాను కలిగి ఉంది. కదలికలను బట్టి కెమెరా ఫోకస్‌ చేస్తుంది. దీంతోపాటు డెస్క్ వ్యూ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఇతర విభాగాల పనితీరుతోపాటు బ్యాటరీ లైఫ్‌ పరంగాను మెరుగైన అనుభూతిని ఇస్తుందని ఆపిల్ చెబుతోంది.

రోజంతా బ్యాటరీ లైఫ్‌ :
మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 24 గంటలపాటు వినియోగించుకోవచ్చని ఆపిల్‌ చెబుతోంది. 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జింగ్‌ చేసే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆపిల్‌ తెలిపింది.

Apple Macbook pro with M5 Pro  M5 max chips

ధర, సేల్‌ వివరాలు :
మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్స్ ను భారత్‌ లో ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. మార్చి 11 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

మ్యాక్‌బుక్‌ ప్రో M5 ప్రో మోడల్ ధరలు
- 14 అంగుళాల 1TB వేరియంట్ ధర రూ.2,49,900
- 16 అంగుళాల 1TB వేరియంట్ ధర రూ.2,99,900

మ్యాక్‌బుక్‌ ప్రో M5 మ్యాక్స్‌ మోడల్ ధరలు
- 14 అంగుళాల 2TB వేరియంట్ ధర రూ.3,99,900
- 16 అంగుళాల 2TB వేరియంట్ ధర రూ.4,29,900

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Macbook pro with M5 Pro and M5 Max Chips launched in india features, price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X