మరింత శక్తివంతంగా యాపిల్ కొత్త ఉత్పత్తులు..

Posted By: BOMMU SIVANJANEYULU

ఐఫోన్ ఆవిష్కరణతో యావత్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న యాపిల్ 2018కుగాను మూడు శక్తివంతమైన ఐఫోన్ మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు తన ఇతర ఉత్పత్తులకు సంబంధించి భారీ అప్‌గ్రేడ్‌లకు యాపిల్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా రివీల్ అయిన బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం యాపిల్ తన మ్యాక్ లైనప్‌కు సంబంధించి మూడు మోడల్స్‌ను కస్టమ్ కో-ప్రాసెసర్‌లతో అందివ్వబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సొంత ప్రాసెసర్ల పైనే ఆధారపడుతూ వస్తోంది..

అప్పటి నుంచి ఇప్పటి వరకు యాపిల్ మార్కెట్ వ్యూహాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ బ్రాండ్ తన సొంత ప్రాసెసర్ల పైనే ఆధారపడుతూ వచ్చింది. ఐఫోన్‌లను A-series చిప్‌లతో, ఎయిర్‌పోడ్స్‌ను W1 chipలతో, యాపిల్ వాచ్‌లను S-series చిప్‌లతో యాపిల్ అందిస్తోంది. ఇక మ్యాక్‌బుక్ ప్రో (టచ్ బార్ మోడల్) అలానే ఐమ్యాక్ ప్రో కంప్యూటర్లు కస్టమ్ టీ-సిరీస్ ప్రాసెసర్‌ పై రన్ అవుతున్నాయి..

కొత్త హార్డ్‌వేర్‌తో అప్‌డేట్..

తాజాగా రివీల్ అయిన బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం యాపిల్ తన కొత్త మోడల్ మ్యాక్ కంప్యూటర్లతో పాటు పలు ల్యాప్‌టాప్స్ అలానే డెస్క్‌టాప్ మోడళ్లను కొత్త హార్డ్‌వేర్‌తో అప్‌డేట్ చేయబోతోంది. అయితే ఏఏ డివైస్ ఈ కొత్త అప్‌డేట్‌లను అందుకోబోతంది అనే విషయం పై యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.

MacBook Airకు మొదటి ప్రాధాన్యాత

యాపిల్ మ్యాక్‌ డివైస్‌లలో ఒకటైన MacBook Air, మార్చి 2015 తరువాత నుంచి ఇప్పటి వరకు సరైన అప్‌డేట్‌ను అందుకోలేదు. కాబట్టి, యాపిల్ కొత్త హార్డ్‌వేర్ అప్‌డేట్‌ను అందుకునే ఉత్పత్తుల జాబితాలో MacBook Air ముందు వరసలో ఉండే అవకాశముందని తెలుస్తోంది.

ఆల్ ఇండియా రికార్డు సెట్ చేసిన దువ్వాడ జగన్నాధమ్

రెండు క్యాటగిరీలుగా విభజించి...

వాస్తవానికి యాపిల్ తన Mac అలానే iMac ఉత్పత్తులను రెండు క్యాటగిరీలుగా విభజించింది. మ్యాక్‌బుక్, మ్యాక్‌బుక్ ప్రో అనేవి యాపిల్ నోట్‌బుక్ లైనప్ క్రిందకు వస్తే.. ఐమ్యాక్, ఐమ్యాక్ ప్రో, మ్యాక్ ప్రో ఇంకా మ్యాక్ మినీలు యాపిల్ డెస్క్‌టాప్ లైనప్ క్రిందకు వస్తాయి.

యాపిల్ T1 chip..

యాపిల్ కస్టమ్ ప్రాసెసర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే యాపిల్ T1 chipను మొట్టమొదటి కస్టమ్ చిప్‌గా చెప్పుకోవాలి. ఈ చిప్‌ను 2016లో లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ప్రో (టచ్‌బార్ సపోర్ట్) వర్షన్ లో యాపిల్ నిక్షిప్తం చేసింది. ఈ చిప్ టచ్ బార్ టచ్ స్ర్కీన్ స్ట్రిప్ ను కంట్రోల్ చేయటంత పాటు టచ్ ఐడీ అలానే యాపిల్ పే సర్వీసులను మరింత సెక్యూర్ గా అథంటికేట్ అయ్యేలా చూస్తంది.

యాపిల్ T1 chip...

T1 chipలతో కూడిన టచ్ బార్‌లను ఈ ఏడాది లాంచ్ చేయబోయే మరిన్ని నోట్‌బుక్‌లలో యాపిల్ ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. టీ1 చిప్‌కు సక్సెసర్ వర్షన్‌గా యాపిల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన యాపిల్ టీ2 చిప్ మెరుగుపరచబడిన సెక్యూరిటీ ఫీచర్లతో ఐమ్యాక్ ప్రోను ముందుకు నడిపిస్తోంది. ఈ చిప్‌ను మరింతగా అప్‌గ్రేడ్ చేసి త్వరలో లాంచ్ చేయబోయే ఐమ్యాక్ మోడళ్లలో యాపిల్ పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
According to a Bloomberg report, Apple is working on three updated Mac models with custom co-processors that could launch as soon as this year.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot