ఆపిల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటి ..?

Posted By: Prashanth

ఆపిల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటి ..?

 

నిత్యం సంచలనాలతో సహవాసం చేసే ‘ఆపిల్’ న్యూ ఇయర్ కానుకతో మరోసారి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ ఎదుగుదలలో క్రీయాశీలక పాత్ర పోషించిన ‘ఐప్యాడ్ సిరీస్ నుంచి మరో కొత్త ఐప్యాడ్ వేరియంట్ కొత్త ఏడాది కానుకగా విడుదలవుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. కొత్త వర్షన్‌లో రాబోతున్న ‘ఐప్యాడ్ 2ఎస్’కు సంబంధించి పూర్తి వివరాలను 2012 జనవరి 26న నిర్వహించే మ్యాక్ వరల్డ్ సమావేశంలో వెల్లడించనున్నట్లు డిగీటైమ్స్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

కొత్త ఐప్యాడ్ ఫీచర్లకు సంబంధించి పుకార్లు గుప్పుమంటున్నాయి. అత్యాధునిక రెటినా డిస్‌ప్లే‌ను ‘ఐప్యాడ్ 2ఎస్’లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ కరెంట్ ఐప్యాడ్ మోడల్స్‌కు నాలు రెట్లు అధికంగా ఉండోచ్చని విశ్లేషణలు అంచనా వేస్తున్నాయి. ఐప్యాడ్ 2ఎస్ విడుదల కొత్త ఏడాది ప్రధమాంకంలో ఉంటుందని ప్రచారం జోరందుకున్న నేపధ్యంలో ఆపిల్ అనుచురులు అదేవిధంగా సాంకేతిక ప్రేమికులు ఉత్సకతతో ఎదరుచూస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting