మోసం చేసిందంటూ ఆపిల్ పై కేసు నమోదు..?

Posted By: Staff

మోసం చేసిందంటూ ఆపిల్ పై కేసు నమోదు..?

 

మార్చి 7న అంతర్జాతీయంగా విడుదలై హాట్ కేకుల్లా  అమ్ముడువుతున్న ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు అనుకోని షాక్ ఎదురైంది. ఫేక్ ప్రకటనలతో ఆపిల్ వినియోగదారులను మోసగించిందని ఆరోపిస్తూ ఆస్ట్రేలియన్ కాంపీటీషన్& కన్స్యూమర్ కమీషన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

ఫిర్యాదుకు గల కారణాలను వెల్లడిస్తూ....కొత్త ఐప్యాడ్ ప్రమోషన్‌లో భాగంగా ఆస్ట్రేలియా పరిధిలోని వినియోగదారులు కొత్త ఐప్యాడ్ ద్వారా సిమ్‌కార్డ్  సపోర్ట్‌తో 4జీ మొబైల్ డేటా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చుంటూ  ప్రకటనలు గుప్పించింది. తీరా కోనుగోలు చేసిన వారికి ఈ ఫెసిలిటీ యాక్లివేట్ కాకపోవటంతో కన్స్యూమర్ కమీషన్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read In English:

ఈ ఆరోపణ పై స్పందించేందుకు  అక్కడి ఆపిల్ యాజమాన్యం నిరాకరించినట్లు సమాచారం. మోసపూరిత  ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టించన ఆపిల్ నిబంధనలకు కట్టుబడి న్యూ ఐప్యాడ్ కోనుగోలు చేసిన వారికి  డబ్బు వాపసు ఇవ్వాలని కమీషన్ డిమాండ్ చేస్తుంది. ఈ పరిమాణం ఆపిల్ వ్యాపారాన్ని దెబ్బతీసేదిగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot