Home
Computer

యాపిల్ కొత్త ఐప్యాడ్ విశేషాలు క్లుప్తంగా..?

Apple newest iPad Features!!


వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా కొత్త ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌ను ఆవిష్కరించింది. ఐప్యాడ్ సిరీస్‌ నుంచి ఈ డివైజ్ మూడో వెర్షన్ అయినప్పటికీ ఐప్యాడ్ 3 అనకుండా కొత్త ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌గా అభివర్ణిస్తున్నారు. మరింత శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు. దీనితో కంటెంట్‌ను ... ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X