2019 లో ఆపిల్ తీసుకురానున్న సంచలనం : సరికొత్త Mac Pro

  ఆపిల్ తన చివరి డెస్క్టాప్ PC ను 2013 డిసెంబర్లో తీసుకుని వచ్చింది, తర్వాత ఎటువంటి అప్గ్రేడబుల్ వర్షన్స్ ఇంతవరకు రాలేదు. కానీ సీనియర్ ఏక్సిక్యూటివ్స్ చెప్పిన కథనం ప్రకారం సరికొత్త Mac Pro ను 2019 లో ఆవిష్కరించనుంది.Mac హార్డ్వేర్ ప్రాడక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ Tom Boger , Tech crunch తో చెప్పిన విషయం ప్రకారం ,మేము Mac pro విషయం లో పారదర్శకతను కలిగి ఉన్నాము, ప్రతి అంశాన్ని పరిశీలించి పరీక్షించాకనే విడుదలకు పూనుకుంటాము. కావున ఈ సంవత్సరం ప్రవేశపెట్టుటకు వీలు కాదు, 2019 లో మాత్రం ఒక సంచలనం అవుతుంది అని తెలిపారు. Mac pro కి సంబంధించిన పూర్తివివరాలు ఇంతవరకు బయటకు రాలేదు, కనీసం ఎలా ఉంటుందో అన్న ఆలోచనలకు కూడా తావు లేదు. కానీ ఆపిల్ సంస్థకు చెందిన Phil schiller 2017 లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం Mac pro క్రితం మోడల్స్ కన్నా , మన్నికగా ఉండేలా, టెక్నాలజీ మార్పునకు అనుగుణంగా, అప్గ్రేడబుల్ గా, సరికొత్త ఫీచర్స్ మరియు హంగులతో రానుందని తద్వారా సరికొత్త ట్రెండ్ సృష్టించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

  2019 లో ఆపిల్ తీసుకురానున్న సంచలనం : సరికొత్త Mac Pro

   

  టెక్ క్రంచ్ తో చెప్పిన ప్రకారం , ఆపిల్ new Pro WorkFlow టీం ను ఏర్పాటు చేసింది, ఇందులో కళాకారులు, చిత్ర దర్శకులు నేరుగా వారి ఇంజినీరింగ్ టీం తో పనిచేయనున్నారు , వీరు Mac pro రూపురేఖల గురించిన మరియు అనేక విషయాలలో సహాయంగా ఉండబోతున్నారు అని తెలుస్తూ ఉంది. దీనిని బట్టి Mac Pro ను ఆపిల్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉందో తెలుస్తూనే ఉంది .

  ఆపిల్ VP of Hardware Engineering, జాన్ టెర్నస్ ప్రకారం, మేము మా Pro వినియోగదారులను పూర్తిగా అర్ధం చేసుకున్నాం, వారు మా నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నాం. వారి పనులను అంచనా వేయగలిగాo. కళ ఈరోజు ఎక్కడ ఉందో అని కాదు, కళ సమాజాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో మేము ఊహించగలము. అందుకనే mac book రూపకల్పనను అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, అని తెలిపారు.

  మాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం, జియో, Airtel మధ్యనే పోటీ

  ఈ అభిప్రాయాలూ , ఆలోచనల పర్వం చూస్తుంటే ఆపిల్ తన Mac pro తన సరికొత్త ఆవిష్కరణలు, ఫీచర్ల ద్వారా వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోనుందని తెలుస్తుంది. ఆపిల్, macOS High Sierra కు ఈ మద్యనే external GPU కు సపోర్ట్ చేసే విధంగా సరికొత్త అప్డేట్ ను కూడా అందించింది . తద్వారా ఇతర గ్రాఫిక్ కార్డులను Thunderbolt 3 port ద్వారా Mac కు అనుసంధానించుకునే వెసులుబాటుకలిగింది. తద్వారా High end గేమింగ్ మరియు వీడియో ఎడిటింగ్ లకు ఊతమిచ్చేలా సహాయపడగలిగింది.

  ఆపిల్ ఇప్పుడు ప్రత్యేకంగా వర్చువల్ రియాలిటీ మీద దృష్టి కేంద్రీకరించనుందని కూడా తెలుస్తుంది. ఇలాంటి ప్రత్యేకతలకు external GPU లకు సపోర్ట్ ఇవ్వడం చాలా మంచి పరిణామంగా చెప్పబడుతున్నది. కానీ ఈ external GPUల విషయంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ప్రస్తుతానికి AMD's Radeon GPU లకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడినది. త్వరలో మిగిలిన GPU లకు కూడా అప్డేట్ రాగలదని వినియోగదారులు భావిస్తున్నారు.

  English summary
  Apple plans big for 2019; new Mac Pro in the offing More news at Gizbot telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more