చంపేస్తుందంటూ పుకార్లు..?

Posted By: Prashanth

చంపేస్తుందంటూ పుకార్లు..?

 

ఆపిల్ అభిమానులను ఆయోమయానికి గురిచేసే ఓ చేదువార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘17 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో’ వచ్చే ఏడాది నుంచి కనుమరుగు కానుందటూ వార్తలు వినిపిస్తున్నాయి. 13,15 అంగుళాల వేరియంట్‌లలోని మ్యాక్‌బుక్ ప్రో ల్యాపీలను యువత అధికంగా ఆదరించటంతో 17 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాపీలకు ఊహించని స్థాయిలో ఆదరణ తగ్గిందని పలువురు విశ్లేషిస్తున్నారు. సంబంధిత సమాచారాన్ని ఆపిల్ ధృవీకరించాల్సి ఉంది. 2006 జనవరిలో తొలిసారిగా మ్యాక్‌బుక్ ప్రో మార్కెట్లో విడుదలైంది. క్రమంగా ఈ సిరీస్ నుంచి అనేక మోడళ్లలో

ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

17 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ఫీచర్లు:

బరువు 6.6 పౌండ్లు,

2.4గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్,

యూఎస్బీ 2.0 పోర్ట్స్,

వై-ఫై కనెక్టువిటీ,

బ్లూటూత్ 2.1,

స్టీరియో స్పీకర్స్,

మైక్రోఫోన్,

థండర్ బోల్ట్ డిజిటల్ వీడియో అవుట్ పుట్,

ఏఎమ్‌డి రాడియన్ హెచ్‌డి 6770ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆటోమెటిక్ గ్రాఫిక్ స్విచ్చింగ్,

మల్టీపుల్ డిస్‌ప్లే,

ఫేస్ టైమ్ హై‌డెఫినిషన్ కెమెరా,

లితియమ్ పాలీమర్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot