‘ఆపిల్’ సరికొత్త మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్..?

Posted By: Super

‘ఆపిల్’ సరికొత్త మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్..?


ఆపిల్ ‘హ్యాకింగ్’ గొడవేంటానని కంగారుపడుతున్నారా..?, మీ గ్యాడ్జెట్ లోని ‘డేటాను’ఎవరైనా దొంగిలిస్తే గురైతే ఏం చేస్తారు.?, మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోని కీలక సమాచారం నిలువు దోపిడికి గురికాకుండా ఉండాలంటే..?

అత్యాధునిక ఆపరేటింగ్ వ్యవస్థతో ‘ఆపిల్’మరో సారి వార్తల్లో నిలిచింది. నేటి తరం కోరుకుంటన్న సురక్షిత సాంకేతికత పై దృష్టిసారించిన ‘ఆపిల్’ ఓ కొత్త ఆపరేటింగ్ వ్యవస్థను మార్కెట్లో ప్రవేశపెట్టుంది.

‘Mac OS X Lion 10.7.2’ ఆపరేటింగ్ వ్యవస్థను అపడేటెడ్ సెక్యూరుటీ ఫీచర్లతో డిజైన్ చేసింది. ఆపిల్ కంప్యూటర్లతో పాటు ల్యాప్ టాప్ పీసీలలో ఈ సరికొత్త ఆపరేటింగ్ వ్యవస్థను లోడ్ చేసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటింగ్ వ్యవస్థను బెంబేలెత్తిస్తున్న ‘హ్యాకింగ్’, ‘మాల్ వేర్’ తదితర ప్రమాదాలను సరికొత్త ఆపిల్ మ్యాక్ ఆపరేటింగ్ వ్యవస్థ సమర్ధవంతంగా ఎదుర్కొగలదు. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ మీ చెంత ఉంటే, మీ గ్యాడ్జెట్ లోని డేటా, ఈ మెయిల్స్ తదితర ముఖ్య సమాచారం సురక్షితంగా ఉన్నట్లే.

రిమోట్ ఆధారిత టెక్నాలజీని ఈ ఆపరేటింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్లతో రూపొందించిన ‘Mac OS X Lion 10.7.2’ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషక వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మ్యాక్ వినియోగదారులు’ ఈ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ వ్యవస్థను సంబంధిత సైట్లలోకి ప్రవేశించి ఉచితంగా ‘డౌన్ లోడ్’ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot