ఆపిల్ పలుచటి శ్రేణి ఐమ్యాక్ డెస్క్‌టాప్‌లు!

Posted By: Prashanth

ఆపిల్ పలుచటి శ్రేణి ఐమ్యాక్ డెస్క్‌టాప్‌లు!

 

టెక్ టైటాన్ ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన అతి పలుచటి ఐమ్యాక్ డెస్క్‌టాప్‌లను ఈ నెల నుంచి 30 నుంచి ఆపిల్ స్టోర్‌లలో విక్రయింయనున్నారు. రెండు వేరియంట్‌లలో ఈ డెస్క్‌టాప్‌లు లభ్యం కానున్నాయి. వీటిలో మొదటి వేరియంట్ 2560 x 1440పిక్సల్ రిసల్యూషన్‌తో 27 అంగుళాల ఎల్‌ఈడి ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉండగా, రెండవ వేరియంట్ 21.5 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే 27 అంగుళాల వేరియంట్‌కు సంబంధించి రవాణా ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆపిల్.కామ్) ద్వారా 21.5 అంగుళాల ఐమ్యాక్ డెస్క్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలను పరిశీలిస్తే 21.5 అంగుళాల ఐమ్యాక్ వేరియంట్ ధర రూ.85,900. 27 అంగుళాల ఐమ్యాక్ వేరియంట్ ధర రూ.99,990.

సరికొత్త ఐమ్యాక్ డెస్క్‌టాప్ ప్రత్యేకతలు:

క్వాడ్-కోర్ ఇంటెల్‌కోర్ ఐ5 ప్రాసెసర్ (అప్‌గ్రేడెడ్ టూ కోర్ ఐ7),

ఎన్-విడియా జీఫోర్స్ ప్రాసెసర్,

6జీబి ఆఫ్ 1600మెగాహెడ్జ్ మెమెరీ,

1 టాబ్ హార్డ్‌డ్రైవ్,

ఫ్యూజన్ డ్రైవ్,

12జీబి ఎస్ఎస్‌డి హార్డ్‌డ్రైవ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

యూఎస్బీ 3 పోర్ట్స్ (3),

థండర్ బోల్ట్ పోర్ట్స్ (2).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot