ఐప్యాడ్ 3 విడుదల తేదీ ఖరార్..?

Posted By:

ఐప్యాడ్ 3 విడుదల తేదీ ఖరార్..?

 

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణను చొరగున్న ఆపిల్ మార్చిలో భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన మూడవ జనరేషన్ ఐప్యాడ్-3 టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్చి 7న ఆవిష్కరించేందుకు మెగా బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. ఈ విడుదలకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆపిల్ విడుదల చేసినట్లు సమాచారం. గ్యాడ్జెట్ ప్రేమికుల ఎదురుచూపులు మధ్య విడుదల కాబోతున్న ఐప్యాడ్ 3 కీలక ఫీచర్లను పరిశీలిస్తే...

* హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* వేగవంతమైన పనితీరును కనబరిచే శక్తివంతమైన ప్రాసెసర్,

* హై స్పీడ్ వైర్‌లెస్ నెట్‌వర్క్.

రెండేళ్ల క్రితం టాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆపిల్ తన హవాను ఇప్పటికి కొనసాగిస్తుంది. తాము విడుదల చేయుబోతున్న ఐప్యాడ్ 3, ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు గట్టి పోటీనివ్వగలదని ధీమా వ్యక్తం చేస్తుంది. ఆపిల్ ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్ల ఐప్యాడ్ విక్రయాలను జరిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot