అభిమానుల కోసం ఆపిల్..?

టెక్ పరిశ్రమలో దిగ్గజ హోదాను అధిరోహించిన ఆపిల్ కొత్త తరహా ఆవిష్కరణలతో నూతన ఒరవడిని సృష్టిస్తోంది. ఆధునిక సాంకేతికతతో ఐప్యాడ్‌ను డిజైన్ చేసిన ఆపిల్ కంప్యూటింగ్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలికింది. అదే దూకుడుతో ఐప్యాడ్ వర్షన్‌ను అప్‌డేట్ చేస్తూ ఐప్యాడ్ 2ను విడుదల చేసి తన చరిష్మాను మనింత పెంచుకుంది. ఐప్యాడ్2ను అప్‌గ్రేడ్ చేస్తూ ఆధునిక వర్షన్ ఐప్యాడ్3ను ఈ ఏడాది తృతియ త్రైమాసికంలో లాంఛ్ చేసేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తుంది.
ఐప్యాడ్ 2 అభిమానులకు మరో తీపి వార్తను ఈ గ్యాడ్జెట్ గెయింట్ వినిపించబోతుంది. ఐప్యాడ్ 3 విడుదలకు ఇంకొన్ని నెలల సమయం ఉన్న నేపధ్యంలో అప్‌డేటెడ్ వర్షన్ ఐప్యాడ్2ను తెర ముందుకు తెచ్చేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తుంది. వచ్చే మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఆధునిక వర్షన్ ఐప్యాడ్ 2 పటిష్ట బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఉన్నత ప్రమాణాలతో కూడిన బ్లూటూత్, వై-ఫై, 3జీ అంశాలను ఈ డివైజ్ లో బలోపేతం చేశారు. జీపీఆర్ఎస్, ఎడ్జ్ ఫీచర్లు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తాయి. నాజూకైన శరీరతత్వం, టచ్ స్ర్కీన్ వ్యవస్థలు డివైజ్ హుందతనాన్ని రెట్టింపు చేస్తాయి. వివిధ కలర్ వేరియంట్ లలో విడుదలకాబోతున్న ఆధునిక వర్షన్ ఐప్యాడ్2 అమ్మకాల విషయంలో వృద్థి సాధిస్తుందని సంస్థ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








