ఆపిల్ ‘హాలివుడ్ రేంజ్’లో అదరగొట్టిదట..!!

Posted By: Super

ఆపిల్ ‘హాలివుడ్ రేంజ్’లో అదరగొట్టిదట..!!

బరువైన ల్యాప్‌టాప్‌లతో ఎన్నాళ్లని తంటాలు పడతారు..పాతబడిన సాంకేతికతను ఎన్నాళ్లని ఉపయోగిస్తారు.. కాలంతో పరిగెత్తే ఆలోచన మీకు లేదా.. మీ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దకున్న ‘న్యూ ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో’ ల్యాప్‌టాప్ త్వరలో విడుదల కానుంది. ఆల్ టైమ్ మార్కెట్లో వన్ అండ్ ఓన్లీగా నిలిచిని ‘ఆపిల్’ ఈ సరికొత్త అల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్‌ను స్లీక్ మెటాలిక్ పరిమాణంతో రూపొందించింది.

ఆకట్టకునే ‘కళాత్మక’ రూపంలో డిజైన్ చేయబడ్డ ‘ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో’, 14.5 అంగుళాల వెడల్పు కలిగి ఉంటుంది. అదనంగా పొందుపరిచిన క్వాడ్ ప్రొసెసర్లు ల్యాప్‌టాప్‌కు అదనపు బలాన్ని చేకూరుస్తాయి. అనుసంధానించిన ‘తండర్ బోల్ట్ టెక్నాలజీ’, ‘టర్బో‌బూస్ట్’ సామర్థ్యం గల ప్రొసెసర్ వంటి అంశాలు వేగవంతమైన బూటింగ్‌కు సహకరించటంతో పాటు సౌలభ్యమైన పనితీరును కలిగి ఉంటాయి. ‘మల్టీ టచ్ ట్రాక్ ప్యాడ్’ వ్యవస్థను ఈ డివైజ్‌లో లోడ్ చేశారు. ఇక కీ బోర్డు విషయానికి వస్తే ఏర్పాటు చేసిన సున్నితమైన బటన్లు వినియోగదారునికి ఒత్తిడిలోనూ సౌకర్యాన్ని కలిగిస్తాయి.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 15.4 అంగుళాలు ఎల్‌ఈడి బ్యాక్‌లైట్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వివిధ రిసల్యూషన్లను పొందుపరిచిన డిస్‌ప్లే సపోర్టు చేస్తుంది. కనెక్ట్వీటీ అంశాలను పరిశీలిస్తే ల్యాప్ టాప్‌లో పొందుపరిచిన ‘మోగాసేఫ్ పవర్ పోర్టు’, ‘జిగా‌బైట్ ఇతర్ నెట్ పోర్టు’, ‘ఫైర్‌‌వైర్ 800 పోర్టు’ వంటి అంశాలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి.

ఇక హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్ అంశాలను పరిశీలిస్తే ఈ సెట్‌లో అసెంబుల్ చేసిన పరికరాలు అవాంతరాలు లేని కంప్యూటింగ్ వ్యవస్థను వినియోగదారునికి అందిస్తుంది. పొందుపరిచిన 2.2 GHz ఇంటెల్ కోర్ i7 ప్రొసెసర్, 4 GB 1,333 GHz DDR3 RAM తదితర వ్యవస్థలు వేగవంతమై పనితీరు స్వభావం కలిగి ఉంటాయి.

ఇక ల్యాప్‌టాప్‌లో అమర్చిన బ్లూటూత్, వై - ఫై 802.11 a/b/g, ఎడ్జ్ 2.1 టెక్నాలజీలు సమాచార వ్యవస్థను మీకు మరింత దగ్గర చేస్తాయి. ఆడియో విషయానికి వస్తే 2.1 సబ్ ఊఫర్‌తో ఉన్న రెండు స్టీరియో స్పీకర్లు నాణ్యమైన సంగీతాన్ని మీకు అందిస్తాయి. అయితే మార్కెట్లో విడుదల కాబోతున్న ‘న్యూ ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో’ మార్కెట్ ధర రూ.1, 21,700గా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot