యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2

Posted By:

కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ మంగళవారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ ఈవెంట్‌లో రెండు లేటెస్ట్ వర్షన్ ట్యాబ్లెట్‌లను ఆవిష్కరించింది. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air), ఐప్యాడ్ మినీ 2 (iPad Mini2) వేరింయట్‌లలో విడుదలైన ఈ టాబ్లెట్‌లు మరింత నాజూకతత్వాన్ని సంతరించుకుని ఆధునిక కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉండటం విశేషం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2

ఐప్యాడ్ ఎయిర్:

ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల పలుచటి నాజూకుతత్వాన్ని కలిగి ఉంటుంది. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటల బ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో లభ్యంకానుంది. యూఎస్ మార్కెట్లో ఐప్యాడ్ ఎయిర్ విలువ 629 డాలర్లు (ఇండియన్ కరెన్స్ ప్రకారం ఈ విలువ రూ.38,777). ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై ఇంకా సెల్యులార్ వర్షన్‌లలో లభ్యంకానుంది.

ఐప్యాడ్ మినీ 2:

4:3 ఆకార నిష్పత్తితో కూడిన 7.9 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ 1536 x 2048 పిక్సల్స్), రెటీనా డిస్‌ప్లే, 324పీపీఐ, ఏ7 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్ 6వ సిరీస్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్7 కోప్రాసెసర్, ఐప్యాడ్ మినీ 2 యూఎస్ మార్కెట్లో నవంబర్ నుంచి లభ్యం కానుంది. ధర 399 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.24,000). యాపిల్ కొత్త వర్షన్ ట్యాబ్లెట్‌లు ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot