ఆపిల్ మరో సృష్టి : ఇక కీ‌బోర్డ్‌ అవసరమే లేదు

Written By:

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి విడులచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఆకంపెనీ నుంచి వచ్చిన ఏ ఉత్పత్తులైనా హాట్ కేకుల్లా అమ్ముడుపోవాల్సిందే. ఇప్పటికే ఐ ఫోన్లతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆపిల్ మ్యాక్ బుక్ లతో మరో చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఆఊఫులోనే ఇప్పుడు ఆపిల్‌ తాజాగా కొత్తరకం ల్యాప్ టాప్ లను విడుదల చేసింది.

ఇంటర్నెట్ లేకుండానే ఫేస్‌బుక్‌ను ఆడేసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మ్యాక్ బుక్ ప్రో

13, 15 ఇంచుల సైజ్ కలిగిన రెటీనా డిస్‌ప్లేతో పాటు కుపెర్టినో ఆధారిత అతి తేలికైన, పలుచని మ్యాక్ బుక్ ప్రో ను ఆపిల్ లాంచ్ చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 12 ఇంచుల మ్యాక్‌బుక్ లాగే కొత్త మ్యాక్‌బుక్‌ లను కొత్తగా డిజైన్ చేసి మూడు వేరియంట్లలో అందిస్తోంది.

సాధారణ కీబోర్డులకు స్వస్తి

సాధారణ కీబోర్డులకు స్వస్తి చెపుతూ టచ్ బార్ (రెటీనా క్వాలిటీ మల్టీ డచ్ డిస్ ప్లే) అనే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. త్వరలోనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడిండించింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

13 అంగుళాల మాక్ బుక్ ప్రో ఫీచర్స్

6 వ తరం క్వాడ్ డ్యూయల్ -కోర్ ప్రాసెసర్లు
2.0 గిగాహెడ్జ్ డ్యూయల్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్
3.1గిగాహెడ్జ్ స్పీడ్,
సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్‌డీ టర్బో బూస్ట్ ,
5-అంగుళాల డిస్ ప్లే
1.83 కిలోల బరువు
8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్

15 అంగుళాల మాక్ బుక్ ప్రో ఫీచర్స్

15.5 మి.మీ, 1.83 కిలోల బరువు
గతంకంటే 14 శాతం సన్నగా, 20శాతం వాల్యూమ్ ఎక్కువగా
టచ్ బార్ అండ్ టచ్ ఐడీ, టర్బో బూస్ట్
2.6గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్, ఐ7 ప్రాసెసర్
3.5గిగాహెడ్జ్ స్పీడ్
16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్

ధరలు

సాధారణ కీ బోర్డు ఉన్న13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,499 డాలర్లకు, హై ఎండ్ మోడల్ 13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,799 డాలర్లకు 15అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 2,399డాలర్లు ప్రారంభ ధరలు గా ఆపిల్ వెల్లడించింది.

ఆపిల్ నోట్ బుక్ 25 వార్షికోత్సవం గుర్తుగా

ఈవారంలో జరగనున్న ఆపిల్ నోట్ బుక్ 25 వార్షికోత్సవం గుర్తుగా వీటిని పరిచయం చేస్తున్నట్టు యాపిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిల్లర్ తెలిపారు. దీంతో పాటు మ్యాక్ బుక్ ప్రో లాంచింగ్ ఒక పెద్ద ముందడుగు అని ప్రకటించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple unveils thinnest, lightest new MacBook Pro read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot