ఆపిల్ మ్యాక్‌బుక్ ఇప్పుడు అప్‌గ్రేడ్ వర్షన్లో

Posted By: Super

ఆపిల్ మ్యాక్‌బుక్ ఇప్పుడు అప్‌గ్రేడ్ వర్షన్లో

వినియోగదారులచే ‘నెంబర్ - 1’ బ్రాండ్ గా గుర్తింపుపొందిన ‘ఆపిల్’ ప్రత్యుర్థి సంస్థలకు సవాల్ విసురుతోంది. ఎవరైనా సులువుగా ఆపరేట్ చేసే విధంగా ‘యూజర్ ఫ్రెండ్లీ’ ఫీచర్లతో గ్యాడ్జెట్లను రూపొందించటం దిగ్గజ ఆపిల్ ప్రత్యేకత. వాడకందారుల నుంచి వస్తున్న డిమాండ్ నేపధ్యంలో ఆపిల్ ‘మ్యాక్ బుక్’ వర్షన్ ల్యాపీలను అప్ గ్రేడ్ చేసింది.

15,17,13 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘మ్యాక్ బుక్’ ల్యాపీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గ్యాడ్జెట్లలో ఏర్పాటు చేసిన ఇంటెల్ శాండీ బ్రిడ్జ్ ప్రాసెసర్ సామర్ధ్యాన్ని 100MHz నుంచి 200MHz పెంచారు.

కోర్ i5 వర్షన్లో విడుదలైన 13 అంగుళాల ‘మ్యాక్ బుక్ ప్రో’ఇప్పుడు 2.4GHz ప్రాసెసింగ్ సామర్ధ్యంతో లభ్యమవుతుంది. కోర్ i7 వర్షన్లో రూపుదిద్దుకున్న ‘ 13 అంగుళాల మ్యాక్ బుక్ ల్యాపీ’ ఇప్పుడు 2.8GHz ప్రాసెసింగ్ సామర్ధ్యంతో లభ్యమవుతుంది. 17 అంగుళాల వర్షన్లో డిజైన్ కాబడిన ‘ఆపిల్ మ్యాక్ బుక్’ ల్యాపీల్లో ఇప్పుడు 2.4GHz శాండీ బ్రిడ్జ్ ప్రాసెసింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టారు.

మ్యాక్ OS X లయాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అన్ని ‘మ్యాక్ బుక్’ ల్యాపీల్లో ముందుగానే లోడ్ చేస్తారు. 4జీబీ ర్యామ్, ఛాయిస్ మేరకు 750GB, 500GB హార్డ్ డ్రైవ్ లను ఎంపిక చేసుకోవచ్చు. ల్యాపీల్లో పాందుపరిచిన ‘ఇంటెల్ హెచ్డీ 3000’ గ్రాఫిక్ వ్యవస్థలు నాణ్యమైన గ్రాఫిక్ విజువల్స్ ను విడుదల చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot