Home
Computer

యాపిల్ వాచ్ వచ్చేసింది

యాపిల్ కొత్త ఉత్పత్తుల రాక కోసం యావత్ టెక్నాలజీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన క్షణాలు రానేవచ్చాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్థరాత్రి టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు తమ మొట్ట మొదటి స్మార్ట్‌వాచ్ యాపిల్ వాచ్‌ను ప్రపంచనాకి పరిచయం చేసింది.

యాపిల్ వాచ్ వచ్చేసింది

యాపిల్ వాచ్ ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల విడదలైన మోటరోలా మోటో 360, సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్‌లకు ఈ యాపిల్ డివైజ్ పోటీగా నిలవనుంది. యాపిల్ ఈ విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌ను 2015లో అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ ధర 349 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.20,940) ఉండొచ్చని ఓ అంచనా.

యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులోకిరానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్ ఎడిషన్ వేరియంట్‌ను 18 క్యారట్ బంగారంతో డిజైన్ చేసినట్లు కంపెనీ సిఈఓ టిమ్ కుక్ తెలిపారు.

మరో వేరియంట్ యాపిల్ వాచ్ వివిధ మోడళ్ల లెదర్, మెటల్ ఇంకా స్పోర్ట్ బ్యాండ్ ఆప్షన్‌లతో కలుపుకుని మొత్తం 18 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. యాపిల్ వాచ్ స్పోర్ట్స్ వేరియంట్ 10 మోడళ్లలో లభ్యంకానుంది.

యాపిల్ వాచ్ వచ్చేసింది

యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేసారు. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు.

డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. వినియోగదారుడి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్ కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Apple Watch Officially Announced With Flexible Retina Display, Coming Early 2015. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X