యాపిల్ నుంచి కొత్తరకం ఉత్పత్తులు

Posted By:

వ్యక్తిగత కంప్యూటర్ల తయారీతో ప్రారంభమైన యాపిల్ కంపెనీ ప్రస్థానం ఆ తరువాత మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు, మీడియా ప్లేయర్ల విభాగానికి విస్తరించింది. యాపిల్ కంపెనీ నుంచి వివిధ వేరియంట్‌లలో విడుదలైన ఐఫోన్‌లు, ఐపోడ్‌లు, ఐప్యాడ్‌లకు అంతర్జాతీయ మార్కెట్లో చెక్కుచెదరని ఆదరణ ఉంది.

యాపిల్ నుంచి కొత్తరకం ఉత్పత్తులు

ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకునే క్రమంలో యాపిల్ ‘కొత్తరకం ఉత్పత్తులను' పరిచయం చేయనుందని సమాచారం. యాపిల్ ఐవాచ్ ఈ జాబితాలో ముందుందనే చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాపిల్ కంపెనీ సీఈఓ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా యాపిల్ కొత్త ఉత్పత్తులకు సంబంధించి అనేకమైన రూమర్లు వ్యాప్తిలో ఉన్నాయి. రెండు పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ రూపొందింస్తున్నట్లు పలు అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు పేర్కొనటం జరగింది. అదే సమయంలో యాపిల్ ఐవాచ్ పైనా ఆసక్తికర రూమర్లు వ్యక్తమవుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting