ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్!!

Posted By: Staff

ఆపిల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్!!

 

ఆపిల్ అభిమానులకు ఈ సమాచారం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఐప్యాడ్ -2కు అప్‌డేటెడ్ వర్షన్‌గా మార్చి 7న మార్కెట్లో లాంఛ్ అయిన ఆపిల్ సరికొత్త ఐప్యాడ్ ఈ నెల 27 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త టాబ్లెట్ వై-ఫై, వై-ఫై+4జీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ధరల వివరాలు క్లుప్తంగా:

వై-ఫై వేరియంట్.. 16జీబి- రూ.30,500, 32జీబి - రూ.36,500, 64జీబి - రూ.42,500.

వై-ఫై+ 4జీ వేరియంట్.. 16జీబి- రూ.38,900, 32జీబి - రూ.44,900, 64జీబి - రూ.50,900.

.

కొత్త ఐప్యాడ్ విడుదల నేపధ్యంలో మునుపటి ఐప్యాడ్ 2 ధరను రూ.24,500కు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నెల 27న ఇండియాతో పాటు కొలంబియా, ఎస్టోనియా, ఇస్రేల్, లాట్వియా, లిథువేనియా, మోంటెనెగ్రో, దక్షిణాఫ్రికా, థాయిలాండ్ దేశాల్లో కొత్త ఐప్యాడ్ లాంఛ్ అవుతుంది. మరో 12 దేశాల్లో ఈ నెల 20నే కొత్త ఐప్యాడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. దింతో ఆపిల్ కొత్త ఐప్యాడ్ లభ్యమయ్యే దేశాల సంఖ్య 55కు చేరుకోనుంది.

ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రధాన ఫీచర్లు:

రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048x1536పిక్సల్స్),

డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5X ప్రాసెసర్,

క్వాడ్‌కోర్ గ్రాఫిక్ యూనిట్,

5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,

10 గంటల బ్యాటరీ లైఫ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot