వెయ్యి పెంచారు!

Posted By: Staff

 వెయ్యి పెంచారు!

చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన టాబ్లెట్ కంప్యూటర్ ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’ తాజాగా డిస్‌ప్లే అప్‌డేట్ పొందింది. ఈ క్రమంలో పీసీ ధరను రూ.7,000 నుంచి రూ.8,000కు పెంచారు. రెండు నెలల క్రితం రెసిస్టివ్ టచ్ స్ర్కీన్‌తో విడుదలైన ఈ గ్యాడ్జెట్ కెపాసిటివ్ (సామర్ధ్యపు) డిస్‌ప్లే అప్‌డేట్‌ను పొందటం శుభపరిణామమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కెపాసిటివ్ టచ్‌ స్ర్కీన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా చిన్నారులు మల్టీమీడియా అనుభూతులను మరింత మన్నికతో ఆస్వాదించేందుకు వీలుంటుంది. రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ టెక్నాలజీతో పోలిస్తే కెపాసిటివ్ టెక్నాలజీ వేగవంతంగా స్పందిస్తుంది. 7 అంగుళాల స్ర్కీన్ ఉత్తమమైన విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది. మైక్రోయూఎస్బీ పోర్ట్ సాయంతో టాబ్లెట్‌లోని డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డివైజ్‌లో అమర్చిన శక్తివంతమైన లి-పాలిమర్ బ్యాటరీ 8 గంటల వీడియో ప్లేబ్యాక్, 16 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే:

7 అంగుళాల టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ క్లాక్ వేగం కలిగిన ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

వెబ్‌క్యామ్,

వై-ఫై,

యూఎస్బీ కనెక్టువిటీ,

మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-పాలిమర్ బ్యాటరీ,

అప్ డేటెడ్ ధర రూ.8,000.

ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు సమీప ఆర్చోస్ రిటైల్ స్టోర్‌లలో ఈ పీసీలను పొందవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot