‘ఆర్చోస్’.. ప్రత్యర్థులకు సవాల్

Posted By: Super

‘ఆర్చోస్’.. ప్రత్యర్థులకు సవాల్

హై క్వాలిటీ వస్తువులను ఉత్పత్తి చేయ్యటమే ఆ సంస్ధ ‘మోటో’.., ఉన్నత ప్రమాణాలతో విశ్వవ్యాప్తంగా ఉనికిని చాటుకోవటమే ఆ బ్రాండ్ యెక్క ‘లక్ష్యం’..

అత్యాధునిక ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో ‘ఆర్చోస్ జీ9’ టాబ్లెట్ మార్కెట్లో విడుదలైంది. శక్తివంతమైన 1024*768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి 8 అంగుళాల డిస్ ప్లేతో రూపుదిద్దుకున్న ఈ మెగా గ్యాడ్జెట్ ‘ప్రొఫెషనల్ అవుట్ లుక్’ కలిగి ఉంటుంది.

ఉపయుక్తమైన ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్లో లోడ్ చేశారు. అమర్చిన OMAP 4 స్మార్ట్ మల్టీ కోర్ ఆర్మ్ కార్టెక్స్ A9 ప్రాసెసర్ వేగవంతమైన పని తీరు కలిగి ఉంటుంది. హార్డ్ డ్రైవ్ కాన్పిగరేషన్ 250జీబీ. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీ సామర్ధ్యాన్ని 16జీబీకి పెంచుకోవచ్చు.

వివిధ ఫార్మాట్లలోని ఆడియో, వీడియో ఫ్లేయర్లను సపోర్టు చేసే విధంగా అప్లికేషన్లను టాబ్లెట్లో పొందుపరిచారు. బ్లూటూత్, వై-ఫై 802.11 b/ g/ n కనెక్టువిటీ అంశాలు సమాచార సరఫరాను వేగవంతం చేస్తాయి. సున్నితమైన నావిగేషన్ ప్రక్రియ కోసం జీపీఎస్ వ్యవస్థను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు. యూఎస్బీ మరియు హెచ్డీఎమ్ఐ పోర్టు వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

‘అర్చోస్ జీ9’ వర్షన్లో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పీసీలు రెండు వేరియంట్లలో లభ్యం కానున్నాయి. ‘G9 ఫ్లాష్ సిరీస్’ టాబ్లెట్ పీసీ బరువు 465 గ్రాములు కాగా, ‘G9 హార్డ్ డ్రైవ్ సిరీస్’ టాబ్లెట్ పీసీ బరువు 599 గ్రాములు.

లితియమ్ పాలిమర్ బ్యాటరీ వ్యవస్థ పటిష్టమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 10 గంటల ఇంటర్నెట్ నావిగేషన్ కు బ్యాటరీ టాక్ టైమ్ నందిస్తుంది.

ప్రస్తుత మార్కెట్లో ‘అర్చోస్ 80 G9’ టాబ్లెట్ పీసీల ధరలు రూ.16,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot