అదరగొట్టేందుకు ‘ఆర్చోస్ జీ9 ’ సిద్ధం..!!

Posted By: Staff

అదరగొట్టేందుకు ‘ఆర్చోస్ జీ9 ’ సిద్ధం..!!


‘‘ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఆర్చోస్’ (Archos) తన సామ్రాజ్యన్ని భారతీయ మార్కెట్లో విస్తరించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. జీ9 సిరీస్ తో టాబ్లెట్ కంప్యూటర్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చే్స్తుంది.’’

జీ9 టాబ్లెట్ పీసీల ఫీచర్లు క్లుప్తంగా:

- జీ9 సీరీస్ లో భాగంగా రెండు 8 అంగుళాల టాబ్లెట్ పీసీలతో పాటు, ఒక 10 అంగుళాల టాబ్లెట్ పీసీని ‘ఆర్చోస్’ డిజైన్ చేసింది.

- ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 డ్యూయల్ కోర్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా టాబ్లెట్ పీసీలు రూపుదిద్దకున్నాయి.

- ‘3జీ స్టిక్’ అనే కొత్త ఫీచర్ ఈ టాబ్లెట్ లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

- 3జీ స్టిక్ ఆధారితంగా యూఎస్బీ పోర్టు సాయంతో 3జీ నెట్ వర్క్ వ్యవస్థను మీ కంప్యూటర్ పీసీతో పాటు ల్యాపీలోకి మళ్లించు కోవచ్చు చేసుకోవచ్చు.

- 250 జీబీ హార్డ్ డ్రైవ్, ఇతర మల్టీ మీడియా ఫీచర్లతో పాటు ఆడియో, వీడియో ప్లేయర్లను ఈ టాబ్లెట్లలో ఏర్పాటు చేశారు.

- పాందుపరిచిన అత్యాధునిక గ్రాఫిక్ వ్యవస్థ నాణ్యమైన గ్రాఫిక్ అనుభూతిని కల్పిస్తుంది.

- అనుసంధానించిన లితియమ్ పోలిమర్ బ్యాటరీ నాణ్యమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. గుగూల్ మ్యాప్స్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ అంశాలను ముందుగానే ఈ గ్యాడ్జెట్లలో లోడ్ చేశారు.

- చివరిగా ధర అంశాన్ని పరిశీలిస్తే ‘ఆర్చోస్’ 10 అంగుళాల టాబ్లెట్ ధర రూ.25,000, 8 అంగుళాల టాబ్లెట్ ధర రూ. 20,000 ఉండోచ్చని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot