ఇది గిఫ్ట్‌గా ఇవ్వండి.. చెప్పిన మాట వింటారు!

Posted By: Prashanth

ఇది గిఫ్ట్‌గా ఇవ్వండి.. చెప్పిన మాట వింటారు!

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ బ్రాండ్ ఆర్చోస్ చిన్నారుల కోసం సరికొత్త టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. పేరు ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’. చిన్నారులు మెచ్చే రీతిలో అనేకమైన ఆధునిక ఫీచర్లను ఈ గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు. మందుగా ఇన్స్‌టాల్ చేసిన వివిధ గేమింగ్ అప్లికేషన్‌లు పిల్లలను అబ్బురపరుస్తాయి. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్చోస్ చైల్డ్ ప్యాడ్’ చిన్నారల పాలిట చక్కటి నేస్తం...

టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే:

7 అంగుళాల టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ క్లాక్ వేగం కలిగిన ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

2,000 మ్యూజిక్ ట్రాక్‌లు లేదా 5 సినిమాలు స్టోర్ చేసేకునేంత ఇంటర్నల్ మెమరీ,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

వెబ్‌క్యామ్,

వై-ఫై,

యూఎస్బీ కనెక్టువిటీ,

మన్నికైన బ్యాకప్ నిచ్చే లి-పాలిమర్ బ్యాటరీ,

చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ‘చైల్ట్ సేఫ్ వెబ్ బ్రౌజింగ్’ అప్టికేషన్‌ను టాబ్లెట్టో లోడ్ చేశారు. ఈ సౌలభ్యతతో చిన్నారులు జ్ఞానపరమైన అంశాలతో పాటు విద్య సంబంధిత విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవచ్చు. మార్కెట్లో ఈ వారం విడుదలకాబోతున్న ‘ఆర్చోస్ చైల్ట్ ప్యాడ్’ ధర అంచనా రూ. 7,000.

ఆర్చోస్ 101 G9 టర్బో:

టాబ్లెట్ కంప్యూటర్‌ను ఎంపిక చేసుకునే ముందు ఏ విధమైన అవసరాల కోసం కోనుగోలు చేస్తున్నామో అన్న అంశం పై ఖచ్చితమైన స్పష్టత ఉండాలి. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత సంబంధిత డివైజ్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఇటీవల విడుదలైన పలు టాబ్లెట్ కంప్యూటర్లు వివిధ రంగాలకు ఉపయోపడే విధంగా ప్రత్యేకంగా డిజైన్ కాబడ్డాయి. నిరంతరాయంగా రోజంతా వినోదాన్ని పంచే ‘ఫ్రెండ్టీ మీడియా టాబ్లెట్ పీసీ’ని ఆర్చోస్ (Archos) సంస్ధ డిజైన్ చేసింది. ‘ఆర్చోస్ 101 G9 టర్బో’ వర్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పనితీరు అదే విధంగా ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ 3.2.1 ఆపరేటింగ్ సిస్టం,

* OMAP 4460 ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 1500 MHz

* సిస్టం మెమరీ 250 జీబి,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot