అసూస్ నుంచి కన్వర్టబుల్ ల్యాప్‌టాప్
ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ100 పేరుతో సరికొత్త కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ కమ్ ట్యాబ్లెట్‌ను అసూస్ ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్‌ను ల్యాప్‌టాప్ అలానే ట్యాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. దేశీయ మార్కెట్లో ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ100 ధర రూ.34,099. గుర్తింపుపొందిన అసూస్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ డివైజ్‌ను నవంబర్ నుంచి విక్రయించనున్నారు.

డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
10.1 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),
డీటాచబుల్ కీబోర్డ్ ఫీచర్,
1.33గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ బే ట్రెయిల్- టీ జెడ్3740 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,
32జీబి బుల్ట్-ఇన్ ఇఎమ్ఎమ్‌సీ స్టోరేజ్ ఎక్స్‌ప్యాండబుల్ వయా మైక్రోఎస్డీ కార్డ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 3.0, మైక్రో-హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ),
1.2 మెగా పిక్సల్ కెమెరా,
11 గంటల బ్యాటరీ లైఫ్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఇదే కార్యక్రమంలో భాగంగా అసూస్, ఫోన్‌ప్యాడ్ 7(FonePad 7) పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ధర రూ.17,499. అసూస్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ డివైజ్‌ను నవంబర్ నుంచి విక్రయించనున్నారు. ఫోన్ పరిమాణం 196.6 x 196.8 x 10.5మిల్లీమీటర్లు, బరువు 328 గ్రాములు. అసూస్ ఫోన్ ప్యాడ్ 7, 7 అంగుళాల ఐపీఎష్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం1280x 800పిక్సల్స్.
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.6గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, సెన్సార్లు (జీ- సెన్సార్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, హాల్ సెన్సార్). 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(బరస్ట్ మోడ్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ (హెచ్ఎస్ పీఏ+యూఎల్: 5.76 ఎంబీపీఎస్, డీఎల్:42ఎంబీపీఎస్), వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్ వీ3.0, ఏజీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ, 2 ఇన్ 1 ఆడియో జాక్ (హెడ్‌ఫోన్, మైక్‌ఇన్), మైక్రోసిమ్ కార్డ్ స్లాట్. 3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (28గంటల టాక్‌టైమ్, 35 రోజులస్టాండ్‌బై టైమ్, 10 గంటల వీడియో ప్లేబ్యాక్ (3జీ)).
అసూస్ కొత్త ట్యాబ్లెట్‌లో సోనిక్‌మాస్టర్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేయట జరిగింది. ఈ స్పీకర్లు అత్యుత్తమ క్వాలిటీని కలిగి ఉంటాయి. ప్రత్యేక ఫీచర్లు: 5జీబి అసూస్ వెబ్ స్టోరేజ్ ఆఫీస్ సూట్, సూపర్ నోట్ అప్లికేషన్.


Click it and Unblock the Notifications








