విండోస్ 8 వైపు అసస్.. ఏసర్!

Posted By: Staff

విండోస్ 8 వైపు అసస్.. ఏసర్!

 

 

విండోస్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ ఈ అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపధ్యంలో  ఏసర్, అసస్‌లు విండోస్ 8 వైపు అడుగులు వేసేందకు సిద్ధంగా ఉన్నాయి.

అసస్ డిజైన్ చేసిన విండోస్ 8 టాబ్లెట్  అసస్ 600 కీలక ఫీచర్లు:

- సూపర్ ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన 10.1అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,

- మల్టీ టచ్‌స్ర్కీన్, ఆటాచబుల్ క్వర్టీ-టైప్ కీబోర్డ్,

- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 2జీబి ర్యామ్.

- 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

- 4జీ ఎల్ టీఈ రేడియో,

- బ్లూటూత్ 4.0,

- వై-పై కనెక్టువిటీ,

- క్వాడ్ టెగ్రా 3 ప్రాసెసర్,

- విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

- ఎన్-విడియా 12-కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

విండోస్ 8 వోఎస్ పై స్పందించనున్న మరో టాబ్లెట్ ‘ఏసర్ ఐకోనియా ట్యాబ్ డబ్ల్యూ510’.ఈ పీసీలో నిక్షిప్తం చేసిన ‘ట్రై’మోడ్ ఫీచర్ టచ్, టైప్, వ్యూ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. కీబోర్డ్ డాక్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు సహకరిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ 18 గంటలు.

కీలక స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920-y-1080),

ఎల్ఈడి బ్యాక్‌లిట్ ఎల్‌సీడి,

మల్టీ టచ్‌స్ర్కీన్,

ఇంటెల్ ఆర్మ్ ప్రాసెసర్.

యూఎస్, యూకె, ఇండియా దేశాల్లో అసస్ విండోస్ టాబ్లెట్ 600ను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot