Home
Computer

ధర రూ.19,990 కే Asus కొత్త ల్యాప్ టాప్ లాంచ్ అయింది! సేల్ వివరాలు

By Maheswara

ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్థ Asus క్రోమ్ బుక్ CX15 ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ చిప్‌సెట్ మరియు గ్రాఫిక్స్ కార్డ్, హెచ్‌డి కెమెరా, 12 గంటల బ్యాటరీ బ్యాకప్ తో తక్కు ధరలో భారత మార్కెట్లో లాంచ్ చేయబడింది.

ASUS క్రోమ్ బుక్ CX15 స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల (1920 x 1080 పిక్సెల్‌లు) ఫుల్ HD LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే తో, ఈ డిస్ప్లే 220 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 45% NTSC కలర్ గామట్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో క్రోమ్ OS తో కూడిన ఇంటెల్ సెలెరోన్ N4500 చిప్‌సెట్ ఉంది. ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 600 కార్డ్‌తో కూడా వస్తుంది. ఈ క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ 4GB RAM + 64GB మెమరీ మరియు 4GB RAM + 128GB మెమరీతో 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Asus Chromebook CX14 And CX15 Series Laptops Launched In India. Price,Specifications And Sale Details.

ఇందులో 8GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీనికి పూర్తి-పరిమాణ ఎర్గోనామిక్ స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ అందించబడింది. ఈ కీబోర్డ్ 1.5mm కీ-ట్రావెల్ సపోర్ట్‌తో వస్తుంది. US MIL-STD 810H (US MIL-STD 810H) రక్షణ అందించబడింది. ఈ ఆసుస్ క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ వీడియో కాలింగ్ కోసం 720p రిజల్యూషన్‌తో HD కెమెరాను కలిగి ఉంది. అదేవిధంగా, ఇది కంబైన్డ్ హెడ్‌ఫోన్ మరియు మైక్రోఫోన్ జాక్, బిల్ట్-ఇన్ డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది.

అలాగే, Asus క్రోమ్ బుక్ CX15 ల్యాప్‌టాప్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, టైప్-A మరియు టైప్-C. USB పోర్ట్, మైక్రో SD కార్డ్ పోర్ట్ అందించబడ్డాయి. ఈ క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ 42wh మద్దతుతో రెండు-సెల్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఇది 12 గంటల పాటు నిరంతర బ్యాకప్‌ను అందిస్తుంది. మొత్తంమీద ఈ క్రోమ్ ల్యాప్‌టాప్ బరువు 1.80 కిలోలు ఉండి, ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ కలర్‌లో లభిస్తుంది.

ఈ Asus క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ యొక్క 4GB RAM + 64GB RAM మోడల్ ధర రూ. 19,990 గా నిర్ణయించారు. అదేవిధంగా 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ మోడల్ ధర రూ.20,990 గా, 8 జీబీ ర్యామ్ + 64 జీబీ మెమరీ మోడల్ ధర రూ.21,990 గా నిర్ణయించారు.

ఈ Asus క్రోమ్ బుక్ CX15 ల్యాప్‌టాప్ సెప్టెంబర్ 1 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు ASUS ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ Asus క్రోమ్ బుక్ CX15 ల్యాప్‌టాప్ పై ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. తక్కువ బడ్జెట్ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి, ఈ Asus క్రోమ్ బుక్ CX15 ల్యాప్‌టాప్ మంచి ఎంపిక అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Asus Chromebook CX14 And CX15 Series Laptops Launched In India. Price,Specifications And Sale Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X