ఆ రెండింటితో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

Posted By: Staff

ఆ రెండింటితో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

కాలంమారింది.. కాలానుగుణంగా మనుషులు మారారు.. టెక్నాలజీని ఎంచుకునే విషయంలో వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఏ బ్రాండ్ ఉత్తమమైనదో ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ‘Asus’ and ‘Dell’ ల్యాప్‌టాప్‌లతో పాటు టాబ్లెట్‌లను తయారు చేయటంలో ప్రసిద్ధికెక్కిన తయారీ సంస్థలు. అయితే ప్రస్తుతం ‘Asus EE transformer tablet TF101’, ‘Dell Streak 10 Pro’ మధ్య పోటీ నెలకుంది.

ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ‘Asus Eee Pad Transformer’ అత్యుత్తమ docking station, USB ports, 3.5mm audio jack, inbuilt SD card వంటి అంశాలతో రికార్డు స్ధాయిలో అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఏడాది చివరిలో ఇండియన్ మార్కెట్లోకి రానున్న
‘Dell streak 10’ పై భారీ అంచనాలు నెలకున్నాయి.

‘Asus tablet’లోని ప్రత్యేక అంశాలను పరిశీలిస్తే, ‘docking station’కి ప్రత్యేకంగా అనుసంధానించబడిన బ్యాటరీ 16 గంటల పాటు standbyనిస్తుంది. ఇక ‘Dell Streak’ విషయానికొస్తే శక్తివంతమైన 1GHz Dual core, 1GB RAMను టాబ్లెట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇక GPS, Gyro, Accelerometer, Compass, dual stereo speakers వంటి ప్రత్యేక ఫీచర్లు ‘డెల్ స్ట్రీక్’ వినియోగదారులకు మరిన్ని సౌలభ్యతలకు కల్పిస్తాయి.

ఇక Bluetooth, wireless data networkల విషయానికి వస్తే అత్యాధినిక అంశాలైన WLAN 802.11, Bluetooth V2.1 ఫీచర్లు ఈ రెండు టాబ్లెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతకాకుండా ఈ రెండు టాబ్లెట్లలో మెమరీ శాతాన్ని memory slot ద్వారా 32 GBకి upgrade చేసుకోవచ్చు.

అయితే ‘Asus Transformer’ విషయంలో టాబ్లెట్‌ని, కీప్యాడ్ కు అనుసంధానం చేసే సమయంలో పలు ఇబ్బందులు ఎదురువుతున్నాయట. ఇక వీటి ధరల విషయాలకు వస్తే ఈ ఏడాది చివరిలో భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే ‘Dell streak 10’ ధర రూ.25,600 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మార్కెట్లో విడుదలైన ‘Asus Eee Pad Transformer TF 101’ మాత్రం భారతీయ మార్కెట్లో రూ.32,999 పలుకుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot