ఆ ఇద్దరు ప్రస్తుతం ‘మోస్ట్ వాంటెడ్’ ..!!

Posted By: Super

ఆ ఇద్దరు ప్రస్తుతం ‘మోస్ట్ వాంటెడ్’ ..!!

"డిజిటల్ సాంకేతిక వస్తు ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న భారతీయ మార్కెట్లోకి రెండ ‘మోస్ట్ వాంటెడ్’ టాబ్లెట్ పరికరాలు అడుగుపెట్టాయి".... మరి ఆ కొత్త అతిథుల గురించి తెలుసుకుందామా..

ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లైన ‘అసస్’, ‘హెచ్‌టీసీ’లు అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన టాబ్లెట్ పరికరాలను భారతీయ మార్కెట్లో విడుదల చేశాయి. నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లలో రూపుదిద్దుకున్నఈ టాబ్లెట్లు మార్కెట్లో ‘మోస్ట్ వాంటెడ్’ పరికరాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘అసస్ ఇ ప్యాడ్’లో డాకింగ్ సౌలభ్యత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ డాకింగ్ విధానం ద్వారా టాబ్లెట్ నుంచి కీ
బోర్డును సులువుగా వేరుచేసుకుని మీ సౌలభ్యతను బట్ట వినియోగించుకోవచ్చు. ‘హెచ్‌టీసీ ఫ్లైయిర్’కు అధనంగా పొందుపరిచిన ‘డిజిటల్ పెన్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ డిజిటల్ పెన్ ద్వారా కంప్యూటింగ్ వ్యవస్థను సంమర్థవంతంగా అతి సులువుగా నడిపించవచ్చు.

వీటి ఫీచర్లను పరిశీలిస్తే... ‘ఫ్లయిర్’ 7 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం కలిగి ఉండగా, ‘ఇ ప్యాడ్’ 10.1 అంగుళాల డిస్‌ప్లేతో రూపొందించారు. 5 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా వ్యవస్థ రెండు టాబ్లెట్ పీసీలలో ఒకటిగానే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ‘ఫ్లయిర్’లో 1.3 మోగా పిక్సల్, ‘అసస్’లో 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను లోడ్ చేశారు. జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆదారితంగా ‘హెచ్‌టీసీ’ రూపుదిద్దుకుంటే, హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా ‘అసస్ ఇ ప్యాడ్’ పనిచేస్తుంది. నాణ్యమైన బ్యాటరీ వ్యవస్థలను ఈ పీసీలలో పొందుపరిచారు.

బ్లూటూత్, డేటా ట్రాన్స్‌ఫర్, ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థలకు సంబంధించిన అంశాలు రెండు టాబ్లెట్లలోనూ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు వస్తే, మ్యూజిక్ ప్లేయిర్, వీడియో ప్లేయర్, గేమ్స్ వంటి అంశాలను పరికరాల్లో పొందుపరిచారు. ఈ రెండు డివైజుల్లో పొందుపరిచిన వై - ఫై, డేటా మేనేజిమెంట్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. మెమరీ విషయానికి వస్తే ఈ రెండింటిలో 32జీబీ వరకు మెమరీ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మార్కెట్లోని అన్ని ప్రముఖ షాపుల్లో ఈ టాబ్లెట్ పీసీలు లభ్యమవుతున్నాయి. ధరలను పరిశీలిస్తే ‘అసస్ ఇ ప్యాడ్’ రూ.28000 ఉండగా, ‘హెచ్‌టీసీ ఫ్లయిర్’ ధర రూ.30000గా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot