శ్యామ్ సంగ్, అసస్ లు మధ్య వృత్యాసం ఎంత...!!

Posted By: Staff

శ్యామ్ సంగ్, అసస్ లు మధ్య వృత్యాసం ఎంత...!!

'2011" సాక్షిగా రెండు అత్యుత్తమ బ్రాండ్లు పోటిపడనున్నాయి. అయితే ఈ పోటీ ఫోన్ల మధ్య కాదు.. కంప్యూటింగ్ వ్యవస్థలో నూతన ఒరవడికి నాంది పలికిన 'టాబ్లెట్ పీసీ"ల మధ్య పోరు నెలకుంది. ఈ పోటీ బ్రాండ్లలో ఒకటి 'శ్యామ్‌సంగ్" కాగా మరొకటి 'అసస్" రెండు పేరు మోసిన బ్రాండ్లే. అధునాతన సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ఈ రెండు బ్రాండ్లు రూపొందించిన 'టాబ్లెట్ పీసీ"లు ఈ ఏడాది మార్కెట్లో తలపడనున్నాయి.

శ్యామ్ సంగ్ ప్రవేశపెట్టన 'శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 10.1" ఇప్పటికే మార్కెట్లో విడుదలై సంచలనాలు సృష్టిస్తుండగా, అసస్ ప్రవేశపెట్టబోతున్న 'అసస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్" పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక వీటిలో ఫీచర్లను పరిశీలిస్తే రెండింటికి మధ్య స్వల్ప తేడాలే చోటుచేసుకున్నాయి. 'హనీకూంబ్ ఆండ్రాయిడ్ 3.1" ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగ శ్యామ్‌సంగ్ గెలక్సీ రూపుదిద్దుకోగా, 'అసస్" ఆపరేటింగ్ వ్యవస్థకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ర్యామ్, ప్రొసెసర్ విషయానికి వస్తే పరిమాణంలో ఈ రెండింటి మధ్య ఎటువంటి వృత్యాసం లేదు. 1GHz డ్యూయల్ న్విడియా ప్రాసెసర్, 1GB ర్యామ్‌లను ఈ టాబ్లెట్లలో పొందుపరిచారు. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే 'శ్యామ్‌సంగ్" ట్యాబ్ TFT–LCD స్వభావం కలిగి ఉంది. 'అసస్" విషయానికి వస్తే IPS డిస్‌ప్లే స్వభావం కలిగి ఉంటుంది. ఈ రెండు టాబ్లెట్లు టచ్‌స్ర్కీన్ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే 1280 X 800 రిసల్యూషన్ కలిగి ఉంటాయి. అయితే ఈ ట్యాబ్లెట్లలో పొందుపరచిన వై - ఫై 802.11, 'బ్లూ టూత్", 'మినీ యూఎస్‌బీ", 'హెడీఎమ్‌ఐ యుటీలిటీ" వంటి అంశాలు ఇతర టాబ్లెట్లతో పోలిస్తే మెరుగైన స్వభావం కలిగి ఉంటాయి.

ఇక ఇంటర్నల్ మెమరీ విషయానికి వస్తే 'అసస్" మెమరీని 32 జీబీకి ఎక్స్‌టెర్నల్ మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా పెంచుకోవచ్చు. అయితే ఈ అంశంలో 'శ్యామ్‌సంగ్" వెనకబడి ఉంది. ఇక పోర్టబులిటీ విషయానికి వస్తే పరిమాణంలో 'అసస్", 'శ్యామ్‌సంగ్" కన్నా చిన్నది. వీటి బరవులను పరిశీలిస్తే 'గెలక్సీ" 595 గ్రాముల బరువు కలిగి ఉండగా, 'అసస్" మాత్రం కాస్త ఎక్కువుగా 680 గ్రాముల బరవు కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 'అసస్" 1.2 మెగా పిక్సల్ ఫ్రెంట్ కెమెరా, 5 మెగా పిక్సల్ 'రేర్" కెమెరా కలిగి ఉంది. ఇక 'శ్యామ్‌సంగ్" విషయానికి వస్తే 3 మోగా పిక్సల్ కెమెరా మాత్రమే కలిగి ఉంది.

అయితే ఇప్పటికే మార్కెట్లో విడుదలైన 'శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 10.1" వినియోగదారులను ఆకర్షిస్తుండగా, ' అసస్ ట్రాన్స్ ఫార్మర్" విడుదలకు సంబంధించి మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot