‘అసస్’ డెస్క్‌టాప్‌తో 40% పొదుపు!!

Posted By: Staff

‘అసస్’ డెస్క్‌టాప్‌తో 40% పొదుపు!!

 

ల్యాప్‌టాప్‌ల సంస్కృతి విస్తరించినప్పటికి డెస్క్‌టాప్ పీసీలకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. పని విషయంలో ల్యాపీతో పోలిస్తే డెస్క్‌టాప్ పీసీ సౌకర్యవంతంగా ఉండటమే ఇందుకు కారణం. డెస్కటాప్ పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్లో నెలకున్న డిమాండ్ నేపధ్యంలో అసస్(Asus)‘Essentio CM 1740-04’ వర్షన్లో డ్యూయల్ కోర్ డిజైన్ డెస్క్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

‘Essentio CM 1740-04’ డెస్క్ టాప్ ఫీచర్లు:

- డ్యూయల్ కలర్ స్కీమ్,

- శక్తివంతమైన AMD A8 3800APU వ్యవస్థ,

- RADEON 6550D గ్రాఫిక్ ప్రాసెసర్,

- 1TB స్టోరేజి సామర్ధ్యం,

- ర్యాండమ్ మెమరీ 8జీబీ,

- తక్కువ పవర్‌ని ఖర్చు చేసి, వినయోగదారుడికి లబ్ధి చేకూర్చే విధంగా ‘EPU chip’ను డెస్క్‌టాప్‌లో ఏర్పాటు చేశారు.

- 6 అత్యాధునిక యూఎస్బీ పోర్టులతో, హెచ్డీఎమ్ఐ, వీజీఏ అవుట్‌పుట్, ఇతర్‌నెట్ జాక్‌లు డెస్క్‌టాప్‌లో ఏర్పాటు చేశారు.

- వై-ఫై వ్యవస్థ లేనప్పటికి, నెట్ వర్క్ కార్డ్ ఆధారితంగా ఇంటర్నెట్‌కు జత చేసుకోవచ్చు.

- సంవత్సరం వారంటీతో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న అసస్ ‘Essentio CM 1740-04’ధర రూ.30,000 ఉండోచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot