మల్టీ స్టారర్ పై పెరుగుతున్న అంచనాలు!!

Posted By: Prashanth

మల్టీ స్టారర్ పై పెరుగుతున్న అంచనాలు!!

 

గుగూల్ నెక్సస్ లైనప్ నుంచి విడుదలైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో ఏలా అమ్ముడుపోయాయో మనందరికి తెలుసు. ఈ నేపధ్యంలో గుగూల్ నెక్సస్ లైనప్ నుంచి టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసే దిశగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అసస్ ఈ టాబ్లెట్‌ను డిజైన్ చేస్తునట్లు సమాచారం.

పలు ముఖ్య వర్గాలు ఈ టాబ్లెట్ ఫీచర్లను బహిర్గం చేశాయి, వాటి వివరాలు:

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* టెగ్రా 3 ప్రాసెసర్.

రెండు బలమైన కంపెనీల సమన్వయంతో రూపుదిద్దుకుంటున్న ఈ హై ఎండ్ కంప్యూటింగ్ డివైజ్ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఇప్పటికే పలు దేశాల కంప్యూటింగ్ మార్కెట్లలో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీకి, గుగూల్ నెక్సస్ పోటీగా నిలవనుందని పరిశీలకల అంచనా. సామన్య, మధ్య తరగతి వినియోగదారులకు సైతం ఈ టాబ్లెట్‌ను అందుబాటులో ఉంచేందకు తక్కువ ధరకే వీటిని విక్రయించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచరం. ధర అంచనా రూ.10,000, విడుదల తేదీ తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot