ఆ రెండు పార్టీలు కలిసి... దూసుకుపోతున్నాయి!!

Posted By: Staff

ఆ రెండు పార్టీలు కలిసి... దూసుకుపోతున్నాయి!!

 

గూగుల్ నెక్సస్ నుంచి విడుదలైన ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు అనతి కాలంలోనే అత్యధిక ప్రజాధరణను సొంతం చేసకున్నాయి. వీటి అమ్మకాలు గణనీయంగా వ్ళద్థి చెందటంతో గుగూల్ నెక్సస్ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ పై ద్ళష్టిసారించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆండ్రాయిడ్ అధునాతన వోఎస్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై స్పందించే 7 అంగుళాల మల్టీ టచ్ టాబ్లెట్ పీసీని గుగూల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ టాబ్లెట్‌ను ప్రత్యేకించి అసస్ డిజైన్ చేస్తుందని తెలుస్తోంది. అసస్, గుగూల్ మధ్య ఈ ఓప్పందం ఇరు కంపెనీల మార్కెట్ వ్ళద్ధికి దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆధునిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న గుగూల్ నెక్సస్ టాబ్లెట్ పీసీలో టెగ్రా 3 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ధర రూ.10,000 (అంచనా మాత్రమే). టాబ్లెట్ ఇతర ఫీచర్లు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot