ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో అసుస్ ఫోన్‌ప్యాడ్ 7

Posted By:

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో అసుస్ ఫోన్‌ప్యాడ్ 7

ప్రముఖ బ్రాండ్ అసుస్ ఫోన్‌ప్యాడ్ 7 (మోడల్ నెంబర్ ఎఫ్ఈ375సీఎల్) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ లాలీపాప్ 4జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను తమ అధికారిక తైవాన్ వెబ్‌సైట్‌లో ఆవిష్కరించింది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో అసుస్ ఫోన్‌ప్యాడ్ 7

అంతర్జాతీయ మార్కెట్లో ఈ డివైస్ ధర 250 డాలర్లు, భారత కరెన్సీలో షుమారుగా రూ.15,000. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడికావల్సి ఉంది. కేవలం 299 గ్రాముల బరువు కలిగి ఉండే ఈ టాబ్లెట్ డివైస్ 12 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో అసుస్ ఫోన్‌ప్యాడ్ 7

అసుస్ ఫోన్‌ప్యాడ్ 7 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల WXGA ఐపీఎస్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 8జీబి, 16జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, క్వాడ్‌కోర్ 64 బిట్ ఇంటెల్ ఆటమ్ జెడ్3530 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0, 12 గంటల బ్యాటరీ లైఫ్.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Asus Fonepad 7 with 4g Support, Android 5.0 lollipop launched. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot