‘అసస్ గేమింగ్ నోట్ బుక్’లతో మీ మాట మీరే వినరు..!!

Posted By: Staff

‘అసస్ గేమింగ్ నోట్ బుక్’లతో మీ మాట మీరే వినరు..!!


‘‘టెక్ యుగంలో అన్ని అద్భుతాలే.. రోజు వినూత్న ఆవిష్కరణలే... సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. కంప్యూటర్ కాస్తా నోట్‌బుక్‌లా మారింది, సెల్ ఫోన్ పరిణితి చెంది స్మార్ట్‌ఫోన్ స్థాయికి ఎదిగింది. తాజాగా గేమింగ్ వ్యవస్థలో రూపాంతరం చెందుతున్న నూతన సమీకరణలు ఆధునిక అధ్యయనానికి అద్దం పడుతున్నాయి. ప్రత్యేకించి వీడియో‌గేమ్‌ల కోసమే గేమింగ్ ల్యాపీలు రూపుదిద్దుకుంటున్నాయి."

ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘అసస్’ రెండు సరికొత్త ల్యాప్‌టాప్ పరికరాలను ప్రత్యేకించి వీడియో‌గేమ్ ప్రేమికుల కోసం నిర్మించింది. అసస్ G74SX, అసస్ G53SX వేరియంట్లలో విడుదల కాబోతున్న ఈ గేమింగ్ ల్యాపీ పరికరాలు హై డెఫినిషన్ అనుభూతిని వినియోగదారుడికి అందిస్తాయి.

క్లుప్తంగా అసస్ G74SX, G53SX ఫీచర్లు:

- అసస్ G74SX, కూలింగ్ టెక్నాలజీ వ్యవస్థతో రూపుదిద్దుకుంది. ఫలితంగా ల్యాపీ హీటెక్కె అవకాశం ఉండదు.

- 3డీ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న G53SX 3D మన్నికైన 3డీ అనుభూతిని వినియోగదారులకు అందిస్తుంది. ఈ ల్యాపీలో పొందుపరిచిన స్ప్లిట్ టెక్నాలజీ 2డీ, 3డీ కంటెంట్‌లను విడి విడిగా చూపుతుంది.

- ఈ రెండు వేరియంట్ల ల్యాపీలలో ఇంటెల్ కోర్ i7 ప్రొసెసింగ్ వ్యవస్ధను వినియోగించారు.

- G74SXలో గ్రాఫిక్ వ్యవస్ధను మరింత బలోపేతం చేస్తూ న్విడియా జీఫోర్స్ GTX560M గ్రాఫిక్ యాక్సిలరేటర్ కార్డును పొందుపరిచారు. అనుసంధానించిన 3 GB DDR3 వీడియో మెమరీ, ఇంటెల్ జీఎమ్ఏ హై డెఫినిషన్ కార్డులు అత్యుత్తమ గేమింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

- G53SXలో 2 GB DDR3 వీడియో మెమరీని అనుసంధానించారు.

- డిస్‌ప్లే అంశాలను పరిశీలిస్తే G74SX’ ‘17’ అంగుళాల వెడల్పు స్క్రీన్ కలిగి ఉండగా, G53SX ‘15’ అంగుళాల స్ర్కీన్ వైశాల్యం కలిగి ఉంటుంది.

- మన్నికైన ఆడియో అనుభూతిని కలిగించే విధంగా టీహెచ్ఎక్స్ (THX), ఈఏక్స్ (EAX) 5.0 3డీ సౌండ్ ఆప్లికేషన్లను ఈ ల్యాపీలలో పొందుపరిచారు.

- వీటి ధర అంశాలను పరిశీలిస్తే G74SX 3D గేమింగ్ నోట్ బుక్ ధర రూ.75000 ఉండోచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో మోడల్ అయిన Asus G53SX 3D గేమింగ్ నోట్ బుక్ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot