పిచ్చెక్కిస్తున్న పై.. పై అందాలు!

Posted By: Prashanth

పిచ్చెక్కిస్తున్న పై.. పై అందాలు!

 

అసస్ రూపొందించిన గుగూల్ బ్రాండెడ్ టాబ్లెట్ నెక్సస్ 7 మార్కెట్లో విడుదలైన హాట్ కేకులా అమ్ముడవుతున్న విషయం తెలిసిందే. ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ అందాన్ని, పనితీరును రెట్టింపు చేసే కీలక విడిభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన కీలక సమాచారం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చస్తుంది. నోర్డిక్ హార్డ్‌వేర్ సంస్ధ బహిర్గతం చేసిన వెల్లడించిన సమాచారం మేరకు నెక్సస్7 విడిభాగాలు క్రింది విధంగా ఉన్నాయి. వాటి పేర్లు:

అసస్ నెక్సస్ డాక్,

అసస్ ట్రావెల్ కవర్,

అసస్ ప్రీమియమ్ కవర్,

Read In English

అసస్ నెక్సస్ డాక్:

అసస్ నెక్సస్ డాక్ సౌలభ్యతతో టాబ్లెట్‌ను డెస్క్‌టాప్ తరహాలో నిలబెట్టుకోవచ్చు. ఈ డాక్, టాబ్లెట్ విజువుల్ ప్రదర్శనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంతో పాటు బ్రౌజింగ్ అనుభూతులను మరింత సుఖమయం చేస్తుంది. డాక్ వెనుక భాగంలో అమర్చిన మైక్రో యూఎస్బీ కనెక్టర్ ద్వారా చార్జింగ్ నిర్వహించుకోవచ్చు. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను సపోర్ట్ చేసే విధాంగా పిన్‌ను డాక్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. 300గ్రాముల బరువును కలిగి ఉండే అసస్ నెక్సస్ డాక్ నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది. ధర అంచనా రూ.3,000. మార్కెట్లో అగష్టు 24న విడుదలవుతుంది.

అసస్ ట్రావెల్ కవర్:

మరో విడిభాగం అసస్ ట్రావెల్ కవర్ ప్రయాణ సందర్భాల్లో టాబ్లెట్ ప్రమాదాలకు లోనుకాకుండా చేస్తుంది. లైట్ పాలిమర్ పదార్ధంతో తయారు కాబడిన ఈ కవర్ గీతలు ఇంకా సాధారణ నష్టాలు టాబ్లెట్‌ను నాశనం చేయకుండా చూస్తుంది. 6 ఆకర్షణీయమైన కలర్ వేరియంట్‌లలో ఈ కవర్ లభ్యం కానుంది. ధర అంచనా రూ.1100.

అసస్ ప్రీమియమ్ కవర్:

ధృడమైన హైక్వాలిటీ లెదర్, రబ్బర్ ఇంకా సాఫ్ట్‌మైక్రో ఫైబర్ క్లాత్ కలయకతో తయారు కాబడిన అసస్ ప్రీమియమ్ కవర్ టాబ్లెట్ పటిష్టతతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తుంది. 4 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో అసస్ ప్రీమియమ్ కవర్ లభ్యం కానుంది. బరువు 85 గ్రాములు. ధర అంచనా రూ.2,200.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

asus-google-nexus-7-dock_thumb

asus-google-nexus-7-dock_thumb

asus-google-nexus-7-tpu-case_thumb

asus-google-nexus-7-tpu-case_thumb

asus-google-nexus-7-premium-cover_thumb

asus-google-nexus-7-premium-cover_thumb
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot