రెండు సంవత్సరాల వారంటీతో ‘అసస్ K43’ని వాడేందుకు సిద్ధంకండి..!!

Posted By: Staff

రెండు సంవత్సరాల వారంటీతో  ‘అసస్ K43’ని వాడేందుకు సిద్ధంకండి..!!

మన్నికనే మంత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు సృష్టిస్తున్న ఆ బ్రాండ్ దాటికి పోటీ కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి. సమజంసమైన ధరలకే సాంకేతిక పరికరాలను వినియోగదారులకు చేరవచేస్తూ విశ్వసనీయతను సొంతం చేసుకుంటున్న ‘అసస్’(Asus) మరో అత్యుత్తత నోట్ బుక్ పరికరాన్ని వినియోగాదురులకు అందించే ప్రయత్నం చేసింది. ‘అసస్ K43 TA’గా మార్కెట్లో విడుదలైన ఈ ల్యాపీ, నోట్ బుక్ల పరిశ్రమలో పోటీ బ్రాండ్లకు చమటలు పట్టిస్తుంది. పటిష్ట బ్యాటరీ వ్యవస్థ ఈ గ్యాడ్జెట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు.

ల్యాపీ ఫీచర్లను పరిశీలిస్తే 14 అంగుళాల స్ర్కీన్ డిస్ ప్లే 1366*768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. పటిష్టమైన 1.4 GHz A6 3400M ప్రాసెసర్ వ్యవస్థ సమర్థమైన పనితీరు కలిగి ఉంటుంది. విండోస్ 7 హోమ్ ఆపరేటింగ్ వ్యవస్థను గ్యాడ్జెట్ లో లోడ్ చేశారు. 8జీబీ ర్యామ్, 4జీబీ ఇంటెర్నల్ మెమరీ, 500జీబీ హార్డ్ డ్రైవ్ వ్యవస్థలు వినియోగాదారుడికి వేగవంతమైన పనితీరును అందిస్తాయి.

2.1కిలలో బరువుతో రూపుదిద్దుకున్న ‘అసస్ K43 TA’ నోట్ బుక్ లో ‘స్టేటస్ ఇండికేటర్’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హెడీఎమ్ఏ, వీజీఏ అవుట్ పుట్ స్పెసిఫికేషన్లను ల్యాపీలో అనుసంధానించారు. మెమరీని వృద్ధి చేసుకునే విధంగా ‘మైక్రో ఎస్డీ స్లాట్’ను ఏర్పాటుచేశారు. కనెక్టువిటీ అంశాలకు సంబంధించి పటిష్ట వై-ఫై, బ్లూటూత్, జీగాబిట్ ఇతర్ నెట్ ఫీచర్లలను ల్యాపీలో అమర్చారు. పటిష్ట లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ 4 గంటల 28 నిమిషాల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాల వారంటీతో రూ.41,000లకు ‘అసస్ K43 TA’ మార్కెట్లో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot