తక్కువ ధరలో 'ఆసస్' డెస్క్‌టాప్‌లు

Posted By: Prashanth

తక్కువ ధరలో 'ఆసస్' డెస్క్‌టాప్‌లు

 

మదర్ బోర్డులు, గ్రాఫిక్ కార్డులను తయారు చేసే తైవాన్‌ కంపెనీ అసూస్ దేశీయ డెస్క్‌టాప్ రంగంలోకి ప్రవేశించింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆరు కంప్యూటర్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.22 వేల నుంచి రూ.85 వేల వరకు ఉన్నాయి. మల్టీమీడియా, గేమింగ్ విభాగంలో మొత్తం ఆరు రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని అసస్ కాంపొనెంట్ బిజినెస్ గ్రూప్ కంట్రీ హెడ్ వినయ్ శెట్టి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అంతేకాకుండా రెండేళ్ల వారంటీతో పాటు కోనుగోలు చేసిన ప్రాంతాల్లో మరమ్మత్తు కూడా చేసి ఇస్తామని తెలిపారు.

60 శాతం మార్కెట్ డెస్క్‌టాప్ పీసీలదేనని, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ విభాగాల్లో ఇవి సంచలనం సృష్టిస్తాయని అన్నారు. సీజీ8565 మోడల్‌ను రీబూట్ చేసే అవసరం లేకుండా తొలిసారిగా ఓవర్‌క్లాక్ ఫీచర్‌ను పొందుపరిచారు. 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. అంతేకాకుండా వీటితో 3డీ తెరలతో హైడెఫినేషన్ గేమింగ్ అనుభూతిని వినియోగదారులు పొందుతారని అన్నారు.

మదర్ బోర్డులు, గ్రాఫిక్ కార్డులు, ఆప్టికల్ డ్రైవ్‌లు, డిస్ ప్లేలు, నోట్ బుక్‌లు నెట్ బుక్‌లు, టాబ్లెట్ పరికరాలు, మల్టీమీడియా సాధనాల వ్యాపారం చేసే తమ సంస్ద గతయేడాది ప్రపంచ వ్యాప్తంగా 11బిలియన్ల బిజినెస్ చేసిందని మేనేజింగ్ డైరెక్టర్ ఆల్బర్ట్ టుంగ్ తెలిపారు. ప్రస్తుతానికి వీటిని తైవాన్ నుండి దిగుమతి చేసుకుంటున్నామని... త్వరలో భారత్‌లో ప్లాంటుని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting