హైదరాబాద్‌లో అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్

Posted By:

హైదరాబాద్‌లో అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ అసుస్ హైదరాబాద్‌లో తన రెండవ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్‌లోని ఐటీ వరల్డ్ (కోపాల్ కంప్యూటర్స్) చినోయ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కొత్త అవుట్ లెట్‌లో అసుస్ వివిధ శ్రేణిల్లో విడుదలు చేసిన టచ్ నోట్‌‍బుక్స్, అల్ట్రాబుక్స్, ట్యాబ్లెట్స్, ఫాబ్లెట్స్ ఇంకా నోట్‌బుక్స్ లభ్యమవుతాయి. ఇప్పటికే అసుస్ కంప్యూటర్స్ అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో తమ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లను నెలకొల్పింది. అసుస్ కంప్యూటర్స్‌కు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ప్రదేశాల్లో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. తాజాగా, అసుస్ తన 100వ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను కోయంబత్తూర్‌లో ప్రారంభించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అసుస్ ఇటీవల ఫోన్‌ప్యాడ్ 7 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. ఈ పోర్టబుల్ డివైస్‌ను ముందుగాఅసుస్, ఫిబ్రవరిలో బార్సిలోనో వేదికగా నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ షోలో ఆవిష్కరించింది. డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల ఐపీఎస్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ ఆటమ్ జెడ్2520 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 64జీబి వరకు విస్తరించకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, వై-ఫై, మిరాకాస్ట్, బ్లూటూత్ 3910ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10గంటల బ్యాటరీ లైఫ్), ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు, పరిమాణం 199.5x120.8x11.35మిల్లీ మీటర్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot